Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ సంతృప్తికరమైన దర్శనం కల్పించడం లేదు.. నమిత

Webdunia
శనివారం, 10 జులై 2021 (13:33 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంపై సినీనటి నమిత అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నమిత మీడియాతో మాట్లాడారు. భక్తులకు టీటీడీ సంతృప్తికరమైన దర్శనం కల్పించడం లేదని అన్నారు. టీటీడీలో ప్రస్తుతం పరిపాలన బాగోలేదని తెలిపారు. గతంలో ఉన్న అధికారి నేతృత్వంలో తిరుమలలో పరిపాలన బాగుందని చెప్పుకొచ్చారు. 
 
ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీటీడీ ఉద్యోగులంతా భయందోళనలో ఉన్నారని నమిత అన్నారు. మరోవైపు తాను నటించిన భౌభౌ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని... త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అలాగే నమిత థియేటర్ పేరుతో ఓటీటీ యాప్, నిర్మాణ సంస్థను ప్రారంభించామని నమిత వెల్లడించారు. 
 
థియేటర్లలో విడుదల చేయాలా ? వద్దా ? లేదా ఓటీటీలో చేయాలా అనేది నిర్ణయం తీసుకోలేదని… దానిపైనే సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. నమితా థియేటర్‌ పేరుతో ఓటీటీ… నమిత ప్రొడక్షన్స్‌ ప్రారంభిస్తున్నామని ఆమె వెల్లండిచారు. దీనిపై అతి త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు నమిత. 
 
కాగా… జెమిని, సింహా, బిల్లా లాంటి సినిమాల్లో నమిత… టాలీవుడ్‌ ప్రేక్షకులను నమిత అలరించింది. ఆ తర్వాత తెలుగు పరిశ్రమలో ఎక్కువగా ఛాన్స్‌‌లు రాక… తమిళ సినిమాలు చేస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments