Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన 15 రోజులకే పారిపోయిన భర్త... తర్వాత ఏం జరిగింది?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (12:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్లొండ జిల్లాలో వ్యక్తి పెళ్లి చేసుకుని కేవలం 15 రోజుల్లో భర్తను వదిలిపెట్టి పారిపోయాడు. దీంతో దిక్కుతోచని ఆ వధువు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి న్యాయం చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నకిరేకల్‌కు చెందిన బిందుశ్రీకి హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సురేశ్‌తో గత ఏడాది వివాహమైంది. తర్వాత 15 రోజులకు సురేశ్‌ ఆస్ట్రేలియా వెళ్లాడు. మళ్లీ వచ్చి భార్యను తీసుకువెళ్తానని నమ్మించాడు. కానీ, ఆరు నెలలు గడిచినా తిరిగి రాలేదు. దీంతో బిందుశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
నిందితుడి పాస్‌పోర్టు సీజ్‌ చేసేలా పాస్‌పోర్టు అధికారులకు, భారత, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయాలకు సీఐ రాజశేఖర్‌ ఈ-మెయిల్స్‌ పంపారు. దీంతో కంపెనీ సురేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ నెల 2న నిందితుడు భారత్‌ వస్తున్నాడని తెలుసుకొన్న సీఐ.. ఢిల్లీ వెళ్లారు. ఇమిగ్రేషన్‌, ఎయిర్‌పోర్టు అధికారుల సహకారంతో సురేశ్‌ను అరెస్టుచేసి తీసుకొచ్చిబాధితురాలికి న్యాయం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments