Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక వృద్ధి రేటు బాగానే వుంది.. రెపో రేట్లలో మార్పుల్లేవ్.. ఆర్బీఐ

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (12:14 IST)
కరోనా కష్టకాలంలోనూ దేశ వృద్ధిరేటు బాగానే వుందని, అందువల్ల రెపో, రివర్స్ రెపో రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. పైగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలు కావడంతో మళ్లీ ఆర్థిక రంగం పునరుత్తేజం అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఫార్మా పరిశ్రమకు మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. 
 
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ తర్వాత ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో నిర్ణయించిన ద్రవ్య విధానాలపై శుక్రవారం పలు కీలక ప్రకటనలు చేసింది. రెపో, రివర్స్ రెపో రేట్లలో వరుసగా మూడోసారి ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్టు చెప్పారు.
 
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 10.5 శాతంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. మొదటి అర్థభాగంలో వృద్ధి 26.2 శాతం నుంచి 8.3 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేశారు. మూడో త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చన్నారు. గతంతో పోలిస్తే ఉత్పత్తి రంగం పుంజుకుందని, మొదటి త్రైమాసికంలో 47.3 శాతం ఉత్పత్తితో పోలిస్తే రెండో త్రైమాసికంలో 63.3 శాతానికి పెరిగిందని చెప్పారు.
 
ఇటీవలి కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐ), విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడులు (ఎఫ్ పీఐ)లు పెరిగాయన్నారు. మున్ముందు అది మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి అర్ధ భాగంలో నిత్యావసరాల ద్రవ్యోల్బణం (నిత్యావసరాల ధరల సూచీ– సీపీఐ) 5 నుంచి 5.2 శాతంగా ఉంటుందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments