Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంగారెడ్డి గూడెంలో వరుస మరణాల కలకలం

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (19:37 IST)
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా 18 మంది మృత్యువాతడటం ఈ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 
 
తొలి మరణం సంభవించినపుడు కల్తీకల్లు తాగి చనిపోయారని భావించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఎక్కడా కూడా కల్తీ కల్లు ఆనవాళ్ళు కనిపిచలేదు. ఆ తర్వాత మరికొందరు ప్రాణాలు విడిచారు. ఈ అంశంపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చ జరిగింది. 
 
అయితే, రోజురోజుకూ ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టినిసారించింది. వరుస మరణాలకు కారణాలు ఏంటో అన్వేషించే పనిలో నిమగ్నమైంది. జిల్లా వైద్యాధికారులతో పాటు పోలీసులు, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో తదితర విభాగాలు ఈ వరుస మరణాల వెనుక ఉన్న మిస్టరీని గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి.
 
అయితే వైద్యులు మాత్రం కిడ్నీల సమస్యలతో వస్తున్న ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే చనిపోతున్నట్టు ఓ అంచనాకు వచ్చారు. అందుకు మద్యం సేవించడం, దాని ప్రభావం కిడ్నీలపై పడటంతో ఈ సమస్య తలెత్తుతున్నట్టు తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments