అమరావతి రాజధాని తరలిస్తే ప్రజా ఉద్యమ ఉప్పెనే :సిపిఐ

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (17:03 IST)
అమరావతి రాజధాని తరలిస్తే దాని జోలికి వచ్చిన ప్రజా ఉద్యమ ఉప్పెన  ఉంటుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక బాలాజీ చెరువు సెంటర్ లో అమరావతి పరిరక్షణ సమితి జే.ఏ.సి ఆధ్వర్యంలో వంటావార్పు జరిగింది.

దీనికి జిల్లా వ్యాప్తంగా అఖిలపక్ష నాయకులు తరలివచ్చారు అదేవిధంగా విద్యార్థి యువజన కార్మిక రైతు జేఏసీ నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు .ముందుగా బాలాజీ చెరువు సెంటర్ వద్ద జరిగిన బహిరంగ సభకు జేఏసి జిల్లా కన్వీనర్ సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించారు.

ముందుగా జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ మూడు రాజధానులు తో పాటు మూడు ముఖ్యమంత్రులు పెడతారా అని ఆయన వ్యంగ్యంగా అన్నారు .ఎక్కడైనా రాజధాని లోసచివాలయం జ్యుడిషియల్ అసెంబ్లీ ఒకే దిక్కున ఉండాలని ఆయన డిమాండ్ చేశారు .విశాఖపట్నం వాసులు కూడా రాజధానికి వస్తుంటే భయపడుతున్నారని ఆయన అన్నారు.

మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నవ్వుతే భయం వేస్తుందని ఆయన అన్నారు. ఒకసారి నవ్వినప్పుడు ప్రజా వేదిక కూల్చివేత ,మరొకసారి నవ్వినప్పుడు పోలవరం ఆగిపోయిందని ఇప్పుడు పెద్దగా నవ్వినందుకు రాజధాని ఇలా అవుతుందని ఆయన ఆయన చలోక్తి విసిరారు .అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని అందరు కట్టుబడి ఉండాలని రాజధాని తరలించ కూడదని అమరావతి రాజధాని అని ఆయన పేర్కొన్నారు.

ఆర్ పి ఐ రాష్ట్ర కార్యదర్శి పిట్ట వరప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి మడమ తిప్పని మాట తప్పని నేత అన్నారని కానీ ఆయనకి మడమ లేదని లేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు .జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అమరావతిని మార్చకూడదని ఆయన తెలియజేశారు.

రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ రైతులు ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం నమ్మి రాజధాని కోసం భూములు ఇచ్చిన విషయాన్ని నేడు జగన్మోహన్రెడ్డి తప్పుగా చూడకూడదని  వారి యొక్క త్యాగం గుర్తించకుండా వారిని రోడ్డుపాలు చేయడం అన్యాయమన్నారు. ఇప్పటివరకు పండగలు పబ్బాలు ఏమీ లేవని అవసరమైతే ప్రాణ త్యాగం సిద్ధపడుతున్నారు అని ఆయన అన్నారు.

మాజీ మంత్రివర్యులు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలియజేశారు రాజధాని విషయంలో ఆయన తప్పటడుగులు వేస్తే ప్రజల చేతిలో తనకు రాజకీయ పతనం ప్రారంభం అవుతుందని ఆయన తెలియజేశారు.

ఆఫ్ పార్టీ నేత నరాల రమేష్ మాట్లాడుతూ రాజధాని విషయంలో వీసాల ఉద్యమం చేయాలని అన్నారు .సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన కమిటీలు మెంటల్ హాస్పిటల్ లో వచ్చిన కమిటీలు గా ఉన్నాయని తెల్ల కాగితాలు మీద జగన్మోహన్ రెడ్డి ఆ కాగితం మీద రాసి ఉన్నారని ఆయన అన్నారు.

జగన్ కి చంద్రబాబు మీద కోపం ఉంటే ఇద్దరూ మల్లయుద్ధం చేసుకోవాలని దాంట్లో నగర మేయర్ గారు రిపురిగా ఉఅంటారని  అంతేగాని ఐదు కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన తెలిపారు .కాకినాడ సముద్రం లాంటి సాక్షిగా అమరావతి తరలిస్తే ప్రజా ఉద్యమం వస్తుందని ఆయన తెలియజేశారు.

కాంగ్రెస్ నాయకుడు  రమణ మాట్లాడుతూ అమరావతి రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమానికి మా పార్టీ తరుపున సంఘీభావం ప్రకటిస్తున్నామని ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో లో టిడిపి సభ్యులు శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు ,మాజీ శాసనసభ్యులు చిక్కాల రామచంద్రరావు ,గొల్లపల్లి సూర్యరావు ,దాట్ల బుచ్చి రాజు ,జ్యోతుల నెహ్రూ ,ఆదిరెడ్డి అప్పారావు ,వంతల రాజేశ్వరి పిల్లి సత్తిబాబు ,పిల్లి అనంతలక్ష్మి ,జనసేన నాయకులు లు పితాని అన్నవరం ,గురు దత్త ప్రసాద్ ,మాకినీడు శేషుకుమారి ,చంద్రశేఖర్ ,మత్స అప్పాజీ , తుమ్మల చందు ,విజయ్ గోపాల్ ,ఆమ్ ఆద్మీ పార్టీ నరవ సురేష్ రమేష్ గోపాలకృష్ణ ,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోకల ప్రసాద్,

పి సత్యనారాయణ ,ఆర్ సతీష్ ,జి.లోవరత్నం  ప్రజా సంఘాలు విద్యార్థి ప్రజా సంఘాలు విద్యార్థి జెఏసి నాయకులు పండు తిరగటి అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు బొమ్మసాని రవిచంద్ర ,వై బాబి ,శీలం వెంకటేష్ ,దళిత హక్కుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి జి మాధవస్వామి ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివ కోటి రాజు ,కార్మిక నాయకులు పి ఎస్ నారాయణ గాదూల ,అప్పలరాజు సాయిబాబా కార్పొరేటర్లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రజానాట్యమండలి కళాకారులూ పాటలు ఆలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments