శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఎపుడో చెప్పారు. ఆస్తుల కోసం దాయాదులు, అయిన వారే కొట్టుకు చస్తారని. ఇపుడు ఎక్కడ చూసినా అలాంటి కేసులే కనపడుతున్నాయి. స్వయంగా వీర బ్రహ్మంగారు జన్మించిన కర్నూలు జిల్లాలోనే ఈ ఉదంతం జరిగింది. ఒక ఇల్లు కోసం తల్లి, కూతురు కొట్లాడుకుని, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
నంద్యాల టెక్కేలో ఇంటి కోసం గొడవపడి... తల్లిపై కూతురు కత్తితో దాడి చేసింది. నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిపై కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ తల్లి బోయ వెంకట లక్ష్మమ్మ ఇంటికి వచ్చి కూతురు దౌర్జన్యం చేసింది. మధ్యలో బాల చంద్రుడు అనే వ్యక్తి అత్త, కోడలిపై అసభ్యకర మాటలతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు.
కొత్తగా కడుతున్న ఇల్లు తనదే అని, పోలీసులు పది రోజులు గడువు ఇచ్చారని, ఇపుడు ఇల్లు నాదేనంటూ కూతురు రాజేశ్వరి తల్లిపై దౌర్జన్యం చేసింది. తల్లిని కత్తితో గాయపరచడమే కాకుండా, తనపై కూడా దాడి చేశారంటూ కూతురు ప్రభుత్వ హాస్పిటలో హైడ్రామా ఆడింది. ఆసుపత్రిలో చేరిన ఇరువురికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. తల్లి, కూతురు గొడవేంటని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు