Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుపేదలకు అండగా నిలుస్తున్న నిర్మలా హైస్కూల్ "దాతృత్వ మాసం"

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (15:20 IST)
చిన్నారులలో సేవా భావాన్ని పెంపొందించే క్రమంలో విజయవాడ నిర్మలా హైస్కూల్ అమలు చేస్తున్న దాతృత్వ కార్యక్రమం నిరుపేదలకు అండగా నిలుస్తోంది. అత్యవసర వేళ అన్నార్తుల కడుపు నింపుతోంది. ప్రతి సంవత్సరం అక్టోబరు నెలలో నిర్మలా విద్యాసంస్ధ తమ విద్యార్ధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పాటిస్తుండగా, పిల్లలు తమదైన శైలిలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. "దాతృత్వ మాసం" ద్వారా సమకూరిన నగదు, బియ్యం, ఇతర వస్తువులను విద్యార్ధుల చేతుల మీదుగా నిరుపేదలకు అందేలా చేస్తూ నిర్మలా హైస్కూల్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
 
ప్రతి ఏటా అక్టోబరు నెలంతా విద్యార్ధులు రోజూ చేతినిండా బియ్యం తీసుకుని ప్రత్యేకంగా పొదుపు చేస్తారు. అదే క్రమంలో తమ పాకెట్ మనీ మొత్తాలు, ఏ రూపంలో నైనా ఇతర సామాగ్రిని సైతం ఈ దాతృత్వం కోసం కేటాయిస్తారు. ఇలా ఈ నెలలో సమకూరిన బియ్యం, ఇతర పొదుపు సామాగ్రిని విద్యార్ధులు అక్టోబర్ 26న పాఠశాలకు అందించగా వాటిని గురు, శుక్రవారాలలో నగర శివారు పకీరుగూడెంలో అగ్ని ప్రమాద బాధితులకు పంపిణీ చేసారు.
 
పాఠశాల సిబ్బందితో కలిసి కొందరు విద్యార్థులు స్వయంగా ప్రమాద స్ధలానికి చేరుకుని 17 బాధిత కుటుంబాలకు ఈ సహాయం అందించారు. సర్వం కోల్పొయిన ఈ కుటుంబాలకు నిర్మలా విద్యార్థులు తమ వంతు సాయంగా ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, నూనె, పప్పు, గోధుమ పిండి తదితర సామాగ్రిని పంపిణీ చేసారు. మరోవైపు ఈ దాతృత్వ కార్యక్రమంలో భాగంగా అక్టోబరు 31వ తేదీ సోమవారం తమ విద్యార్థులు మరో 150 కుటుంబాలకు సహాయం అందించనున్నారని నిర్మలా హైస్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జిబి అంటోని తెలిపారు.
 
ఆటోనగర్ పరిసర ప్రాంతాలలోని మురికివాడను ఇందుకోసం ఎంపిక చేసుకున్నామన్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం ఉదారంగా సహకరించటం వల్లే తాము ఈ కార్యక్రమం ద్వారా పేదలను ఆదుకోగలుగుతున్నామన్నారు. ప్రస్తుతం తమ చిన్నారులు సమకూర్చిన బియ్యం దాదాపు 2,500 కిలోలకు పైబడి ఉన్నాయని సిస్టర్ ఆంటోని వివరించారు. చిన్ననాటి నుండే దాతృత్వ గుణం అలవరిచేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments