Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవర్ హత్య కేసు : ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్

Webdunia
మంగళవారం, 24 మే 2022 (12:11 IST)
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే నెల ఆరో తేదీ వరకు రిమాండ్‌లో ఉంచాల్సిందిగా కాకినాడ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 
 
అంతకుముందు ఆయనకు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టులో దాదాపు గంటకు పైగా వాదనలు జరిగాయి. అనంతబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది వాదించారు. కానీ మేజిస్ట్రేట్ ఆయన వాదనలు పరిగణలోని తీసుకోకుండా రిమాండ్‌కు తరలించారు. 
 
మరోవైపు, సుబ్రహ్మణ్యం హత్య కేసుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్టు అనంతబాబు అంగీకరించారు. కానీ, ఆయన కుటుంబ సభ్యులుమాత్రం సుబ్రమణ్యాన్ని వేరే వ్యక్తితో అనంత పిలిపించినట్లు చెబుతున్నారు.
 
పోలీసులు మాత్రం స్వయంగా అనంతబాబే అతన్ని తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. పథకం ప్రకారం జరిగిన హత్య కాదంటున్నారు. అలాగే రాత్రి పదిన్నర గంటల సమయంలో శంకరటవర్స్‌ లాంటి జనం తిరిగే ప్రాంతంలో గొడవ జరిగిందని పోలీసులు అంటున్నారు. దానికి సంబంధించి ఆధారాలపై స్పష్టత లేదు. 
 
అలాగే మృతుడి శరీరంపై ఇసుక ఉందని, నీళ్లలో నానిన ఆనవాళ్లున్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై స్పష్టత లేదు. అలాగే సుబ్రమణ్యం చేతులు వెనక్కు విరిచిన ఆనవాళ్లున్నట్లు చెబుతున్నారు. ఇది ఎలా జరిగిందన్నదానిపై క్లారిటీ లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments