నారా లోకేష్ విశ్వవిఖ్యాత 'పప్పు' సార్వభౌమ... ఎమ్మెల్యే రోజా సెటైర్లు

వైఎస్సార్సీపి నగరి ఎమ్మెల్యే రోజా సమయం దొరికితే తెదేపాను తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటారు. తాజాగా ఆమె ఏపీ మంత్రి నారా లోకేష్ పైన చేశారు. నారా లోకేశ్‌ను 'విశ్వ విఖ్యాత పప్పు సార్వభౌమ' అంటూ ఎద్దేవా చేశారు. ఏ పని జరగాలన్నా ఆయనకు సూట్‌కేసు ఇవ్వాల్సిందేననీ,

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (14:57 IST)
వైఎస్సార్సీపి నగరి ఎమ్మెల్యే రోజా సమయం దొరికితే తెదేపాను తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటారు. తాజాగా ఆమె ఏపీ మంత్రి నారా లోకేష్ పైన చేశారు. నారా లోకేశ్‌ను 'విశ్వ విఖ్యాత పప్పు సార్వభౌమ' అంటూ ఎద్దేవా చేశారు. ఏ పని జరగాలన్నా ఆయనకు సూట్‌కేసు ఇవ్వాల్సిందేననీ, ఓటేసిన ప్రజలు ఆయన వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి వెళితే పనులు జరగవని అన్నారు. 
 
నోట్ల కట్టలతో వున్న సంచి ఇస్తేనే సంతకాలు పెడతారంటూ విమర్శించారు. బుధవారం ఆమె పార్టీ వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన తెదేపా ఇప్పుడు యువతకు జాబులు లేక అల్లాడుతుంటే ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధైర్యముంటే ఇప్పటికిప్పుడు తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లో నిలబడాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా కోసం తెదేపా చేస్తున్నవన్నీ దిగజారుడు రాజకీయాలని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి 29 సార్లు వెళ్లారని తెదేపా అంటుంటుందనీ, ఐతే ఆయన వెళ్లింది మాత్రం ఓటుకు నోటు కేసు పరిష్కరించుకునేందుకే అంటూ ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments