మూడు పార్టీలు మారి వచ్చిన వారికి మంత్రిపదవులు.. గంటాపై అయ్యన్న ఫైర్
మూడు పార్టీలు మారివచ్చిన వారికి మంత్రిపదవులు ఇచ్చారంటూ రాష్ట్ర మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన వైజాగ్‌లో మాట్లాడుతూ, మూడు పార్టీలు మారి వచ్చిన వ్యక్తికి తెలుగుదేశం పార్ట
మూడు పార్టీలు మారివచ్చిన వారికి మంత్రిపదవులు ఇచ్చారంటూ రాష్ట్ర మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన వైజాగ్‌లో మాట్లాడుతూ, మూడు పార్టీలు మారి వచ్చిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ మంత్రి పదవి ఇచ్చిన విషయం మరచిపోయారా? అని ప్రశ్నించారు. తొలుత టీడీపీలో చేరి, తర్వాత రాజకీయ స్వలాభాల కోసం ప్రజారాజ్యం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, మళ్లీ పదవుల కోసం తెలుగుదేశంలో చేరారని వ్యాఖ్యానించారు.
ఇకపోతే, మంత్రి గంటా తన గతాన్ని మరచిపోయి మాట్లాడటం సరికాదన్నారు. నిబంధనల ప్రకారం డీఎల్‌డీఏకు కొత్త కమిటీని నియమిస్తే తనకు అభ్యంతరం లేదని, అయితే జిల్లాకు చెందిన ఇన్‌ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తెలియకుండా ఆయన(గంటా)కు నచ్చిన వారితో కమిటీని ఏర్పాటు చేయించడం సరికాదని అయ్యన్నపాత్రుడు అన్నారు.
ఆ పదవిని రాజకీయ వివాదాల కారణంగా ఇప్పటికీ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెడలు వంచాలంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగోడి సత్తా చాటడం ఒక్కటే మార్గమని మంత్రి అభిప్రాయపడ్డారు.