Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శభాష్ రాజుగారు.. మీ కర్తవ్య దీక్షకు సలాం...

విజయనగర సామ్రాజ్య వంశానికి చెందిన రాజు.. పూసపాటి అశోకగజపతి రాజు. ఆయలో రాజు అనే దర్పం మచ్చుకైనా కనిపించదు. పైగా, రాజకీయ నేతననే అహంకారం ఇసుమంతైనా ఉండదు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, ఇటీవలే కేంద్

శభాష్ రాజుగారు..  మీ కర్తవ్య దీక్షకు సలాం...
, సోమవారం, 9 ఏప్రియల్ 2018 (09:02 IST)
విజయనగర సామ్రాజ్య వంశానికి చెందిన రాజు.. పూసపాటి అశోకగజపతి రాజు. ఆయలో రాజు అనే దర్పం మచ్చుకైనా కనిపించదు. పైగా, రాజకీయ నేతననే అహంకారం ఇసుమంతైనా ఉండదు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, ఇటీవలే కేంద్ర మంత్రిపదవికి రాజీనామా చేశారు. అలాంటి రాజు.. పుట్టెడు దుఃఖంలోనూ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ సాగుతున్న పోరాటంలో పాల్గొన్నారు. ఆయన్ను చూసిన మిగిలిన ఎంపీలు మరింత పట్టుదలతో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు. ఇంతకీ అశోకగజపతి రాజు పుట్టుడు దుఃఖంలో ఎందుకున్నారో కదా మీ సందేహం... 
 
ఇటీవల అశోకగజపతి రాజు తల్లి కుసుమ కన్నుమూశారు. ఆమె విజయనగర సామ్రాజ్య చివరి పట్టపురాణి కూడా. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే ఆయన ఢిల్లీ నుంచి స్వస్థలం చేరుకున్నారు. గురువారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఎంపీలంతా ఢిల్లీలోనే ఉండాలని సీఎం ఆదేశించడంతో అంత్యక్రియలు పూర్తికాగానే అశోక్‌ ఢిల్లీ చేరుకుని... ధర్నాలో పాల్గొన్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసం ముందు ధర్నాలో అశోక్‌గజపతిరాజు కూడా పాల్గొనడం చూసి, ఆయన కర్తవ్య దీక్షను చంద్రబాబు మెచ్చుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ ఎంపీలను ఈడ్చిపారేసిన ఢిల్లీ పోలీసులు .. ఎందుకు? ఎక్కడ?