Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అన్యాయం జ‌ర‌గ‌ట్లేదు.. ఫ్యాన్స్ గుర్తించాలి: రోజా

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (14:43 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ న‌టించిన 'భీమ్లా నాయ‌క్' సినిమా విడుదల నేపథ్యంలో టిక్కెట్ ధరల తగ్గింపుపై రచ్చ రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను తొక్కేయ‌డానికే జ‌గ‌న్ ఇదంతా చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని తెలిపారు. 
 
నిజానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కి జగన్ మేలు చేస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. ఎందుకంటే తెలంగాణలో సినిమా టికెట్‌ ధర రూ.350 ఉంద‌ని, ఏపీలో మాత్రం కేవ‌లం రూ.150 ఉందని చెప్పారు. చాలా మంది సినిమా చూసే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. 
 
టికెట్ల ధ‌ర‌లు త‌గ్గిస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను తొక్కేసిన‌ట్లు ఎలా అవుతుంద‌ని రోజా ప్ర‌శ్నించారు. సినిమా న‌ష్ట‌పోతే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు వచ్చే నష్టమేమి లేద‌ని, ఎందుకంటే ఆయ‌న నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ కాద‌న్నారు. 
 
అల్లు అర్జున్ పుష్ప సినిమా, బాల‌కృష్ణ అఖండ సినిమాల‌కు ఎంత టికెట్ ధ‌ర ఉందో భీమ్లా నాయ‌క్ సినిమాకు కూడా అంతే రేటు ఉంద‌ని గుర్తు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అన్యాయం జ‌ర‌గ‌ట్లేద‌ని ఆయ‌న అభిమానులు తెలుసుకోవాల‌ని ఆమె చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

Srileela: వార్నర్ క్రికెట్ లో వుంటే వికెట్స్ అంటారు, రాబిన్ హుడ్ కోసం టికెట్స్ అంటారు : శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments