Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'భీమ్లా నాయక్' టీం సక్సెస్ సెలెబ్రేషన్స్

Advertiesment
'భీమ్లా నాయక్' టీం సక్సెస్ సెలెబ్రేషన్స్
, శనివారం, 26 ఫిబ్రవరి 2022 (12:35 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరో, ప్రతినాయకులుగా నటించిన "భీమ్లా నాయక్" చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తొలి ఆట నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' టీం సభ్యులు సక్సెస్ పార్టీని జరుపుకున్నారు. టపాకాయలు పేల్చి, కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. ఈ వేడుకల్లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. 'భీమ్లా నాయక్' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చిన విషయం తెల్సిందే. 
 
కాగా, ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, సముద్రఖని, మురళీ శర్మ, రావు రమేష్, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ తదితరులు నటించారు. థమన్ సంగీతం. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. 
 
'భీమ్లా నాయక్' జోరు... కలెక్షన్ల హోరు  
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "భీమ్లా నాయక్". శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదలైంది. అలాగే, ఓవర్సీస్‌లోనూ రిలీజైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 
 
ఈ చిత్రం అమెరికాలో గురువారం విడుదలై రూ.6.53 కోట్లు వసూలు రాబట్టిందని ప్రముఖ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు. యూకేలో రూ.87.81 లక్షలు, ఐర్లాండ్‌లో రూ.6.44 లక్షలు వసూలు చేసినట్టు వివరించారు. కాగా, భీమ్లా నాయక్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీగా ఇది నిలిచిన విషయం తెల్సిందే. 
 
తొలి రోజున నైజామ్‌లో ఈ సినిమా రూ.11.80 కోట్ల షేర్‌ను సాధించింది. ఇవి ఆల్‌ టైమ్ రికార్డు వసూళ్లను సినీ విశ్లేషకులు చెబుతున్నారు. నైజామ్‌లో ఈ సినిమా అంచలాను అందుకుందని చెప్పుకుంటున్నారు. ఇక శనివారం, ఆదివారాల్లో ఈ భారీ స్థాయిలో ఈ కలెక్షన్లు ఉండే అవకాశం ఉంది. 
 
సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సంయుక్తా మీనన్‌లు నటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. 
 
మూడేళ్ళ తర్వాత 'వకీల్ సాబ్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇపుడు 'భీమ్లా నాయక్' చిత్రంతో రెండో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'భీమ్లా నాయక్' జోరు... కలెక్షన్ల హోరు