Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్రపరిశ్రమను క్షోభ పెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా?

చిత్రపరిశ్రమను క్షోభ పెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా?
, ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. సమస్యలు సృష్టించి, ఆ సమస్యలను తామే పరిష్కరిస్తున్నామంటూ బిల్డప్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సహిస్తున్నామంటూ నమ్మాలా? అని నిలదీశారు. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "భీమ్లా నాయక్" చిత్రాన్ని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేయని పనులంటూ లేవు. ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. థియేటర్ల వద్ద ఏకంగా ప్రభుత్వ అధికారులను మొహరించింది. తనిఖీల పేరుతో థియేటర్ యజమానులను నానా ఇబ్బందులకు గురిచేసింది. ఇపుడు ఈ అంశం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తనదైనశైలిలో కామెంట్స్ చేశారు. #BheemlaNayak #GovtofAndhraPradesh అన్ హ్యాష్‌ ట్యాగ్‌తో ఓ ట్వీట్ చేశారు. అది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
"సృజనాత్మకత, సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? అంటూ నిలదీశారు. చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? అంటూ ప్రశ్నించారు. ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్టవేయలేరని ప్రకాష్ రాజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృతిహాసన్‌కు కరోనా పాజిటివ్