Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో మైనర్ బాలికపై అత్యాచారం..

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (18:05 IST)
చిత్తూరు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. లిఫ్టు పేరుతో ఓ బాలికను ఎక్కించుకున్న ఇద్దరు యువకులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపారు. ఈ దారుణం గత నెల 24వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా ముళ్లపూడిలో తల్లిదండ్రులపై కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసిన బాధితురాలు.. తిరుపతి నుంచి తిరుచానూరు వెళ్లడానికి వెంకటేశ్ అనే యువకుడిని లిప్ట్ అడిగింది. బండిపై తీసుకు వెళ్లిన అతను తిరుచానూరు దాటేసి ముళ్లపూడి దగ్గర బండి నిలిపాడు. 
 
తిరుచానూరు దాటిపోయిన విషయాన్ని ఆ అమ్మాయి తెలుసుకోలేకపోయింది. బండిలో పెట్రోల్ అయిపోయిందని చెప్పేసరికి.. నిజమేనని అనుకుంది. తన స్నేహితుడికి ఫోన్ చేసి పెట్రోల్ తీసుకురమ్మంటానని చెప్పేసరికి.. నిజమేనని భ్రమించింది. అయితే వెంటనే తన స్నేహితుడు రాజ్ మోహన్ నాయక్‌కు ఫోన్ చేసిన వెంకటేశ్.. అక్కడికి రప్పించాడు. 
 
ఇద్దరూ ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపాడు. స్థానికుల సమాచారంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని.. తల్లిదండ్రులకు అప్పగించారని తెలిపారు. నిందితుల్లో ఒకరైన రాజ్ మోహన్ నాయక్‌పై గతంలో ఓ మర్డర్ కేసుతో పాటు రౌడీ షీటర్ తెరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments