Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (17:43 IST)
వైకాపా నేత, మాజీమంత్రి పేర్ని నాని పాపం పండిందని, ఇక వదిలేదని ఏపీ రాష్ట్ర అబ్కారీ శాఖామంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఐదేళ్లు ప్రజలను పీక్కుతిని నేడు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. 2023లో బదిలీ అయిన తాహశీల్దారు 2024లో పట్టాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పేదలపై ప్రేముంటే 6400 టిడ్కో ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. సీఆర్‌జెడ్ భూముల్లో పట్టాలివ్వడాన్ని కోర్టులో తప్పుబట్టాయని గుర్తు చేశారు. 2006లో బందరు పోర్టును అమ్మేసేందుకు పేర్ని నాని ప్రయత్నించారని ధ్వజమెత్తారు. 
 
నియోజకవర్గానిక పట్టిన అతిపెద్ద శనిగ్రహం పేర్ని నాని. సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లింది. తప్పు చేసినవారిని చట్టం వదిలిపెట్టదు. తప్పు చేసి బురదజల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. 8 వేల రేషన్ బియ్యం బస్తాలు బొక్కి బుకాయించడం హేయం. ఇళ్ల స్థలాల పేరుతో అధిక ధరలకు భూమి కొనుగోలు చేయించి కమీషన్లు దండుకున్నారు.
 
మెడికల్ కాలేజీ భూకొనుగోలులో రూ.8 కోట్ల అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక ఇచ్చింది. ప్రజల పోరాటంతో బందరు పోర్టును సాధించుకున్నాం. గత ఐదేళ్ళలో బందరు పోర్టును ఎందుకు పూర్తి చేయలేదు. 2026 నాటికి పోర్టును కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది. బందరుని పర్యాటకం, క్రీడా కేంద్రంగా మార్చేలా చర్యలు తీసుకుటుంది అని కొల్లు రవీంద్ర అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments