పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది నోరు పారేసుకున్నారు. దీనికి భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గట్టిగా కౌంటరిచ్చాడు. కార్గిల్లో చిత్తుగా ఓడించాం.. ఇంకా సిగ్గు రాలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు.
ఇటీవల పాకిస్థాన్ టీవీతో ఆఫ్రిది మాట్లాడుతూ, భారత భద్రతా దళాల వైఫల్యం వల్లే దాడి జరిగిందని ఆరోపించారు. భారత సైన్యం సామర్ధ్యాన్ని ప్రశ్నించారు. కాశ్మీర్లో 8 లక్షల మంది సైనికులు ఉన్నా ప్రజలకు భద్రత కల్పించలేకపోయారని విమర్శించారు. దీనిని బట్టి వారు అసమర్థులని అర్థమవుతోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై శిఖర్ ధావన్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. కార్గిల్లో ఓడించాం. గుర్తులేదా. ఇప్పటికే చాలా దిగజారారు. ఇంకా ఎంత దిగజారుతారు. అనవసర వ్యాఖ్యలు చేసే బదులు మీ దేశాభివృద్ధిపై దృష్టిసారించండి. మా భారత సైన్యం పట్ల మాకు చాలా గర్వంగా ఉంది. భారత్ మాతాకీ జై .. జైహింద్ అన్నారు.