Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటీ జన జాతర.... వైసీపీ పేరెత్తకుండా చురకలు...

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (08:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా పార్టీ నేతలు చేస్తున్న హంగామాపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి చురకలంటించారు. లాక్‌డౌన్ వేళ అధికార పార్టీ నేతలు జన జాతర చేయడం పట్ల తీవ్ర ఆక్షేపం వ్యక్తం చేశారు. పైగా, లాక్‌డౌన్ ఆంక్షలు ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 
 
ఇదే అశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నాం. ఈ లాక్‌డౌన్ ఆంక్షలు అందరికీ సమానమే. అధికార పక్షమైనా, విపక్షమైనా నిబంధనలు పాటించి తీరాల్సిందే. లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. 
 
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలు సహాయం పేరిట చేస్తున్న జన జాతరపై ఆయన పరోక్షంగా స్పందించారు. సూటిగా వైసీపీ పేరెత్తకుండా, ఆ పార్టీకి చురకలంటించారు. 'కొందరు ట్రాక్టర్‌ ర్యాలీలు, సమావేశాలు, చిన్న చిన్న సభలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా సూచించాను' అని తెలిపారు. 
 
పైగా, కేసుల సంఖ్య తగ్గుముఖంపట్టి, ప్రస్తుతం కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారంతా కోలుకునేదాకా లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు. కరోనా తీవ్రతను అనుసరించి గ్రీన్‌జోన్‌లలో ఆంక్షల విధింపులో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు. గ్రీన్‌జోన్‌లలో పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేందుకు అనుమతించామన్నారు. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసుల ద్వారా నిర్వహించే ప్రజా రవాణాకు ఇప్పట్లో అనుమతించబోమని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments