Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-04-2020 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధిస్తే...

Advertiesment
30-04-2020 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధిస్తే...
, గురువారం, 30 ఏప్రియల్ 2020 (05:00 IST)
మేషం : కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో స్వీయపర్యవేక్షణ ముఖ్యం. స్త్రీలకు చీటికి మాటికి అసహనం, నిరుత్సాహం వంటి చికాకులు తప్పవు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెళకువ వహించండి. 
 
వృషభం : రాజకీయ, పారిశ్రామికరంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. సోదరుల నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు. కళాకారులకు టీవీ, నాటకరంగంనందున్నవారు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సంఘంలో మీకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. గత కొంతకాలంగా కుటుబంలో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. నమ్మినవారే దగా చేయుదురు. మీ యత్నాలకు మీ శ్రీమతి నుంచి అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మెళకువ అవసరం.  
 
కర్కాటకం : ఉద్యోగంలో ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం. ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. బీమా, పెన్షన్, వ్యవహారాలు క్రయ విక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెలకువ వహించండి. 
 
సింహం : విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బదిలీలు, మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నోటీసులు, రశీదులు అందుకుంటారు. మీ ప్రియతముల పట్ల ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగును. కీలకమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. 
 
కన్య : దంపతుల మధ్య పరస్పర అవగాహన తలెత్తుట వల్ల సమస్యలు తప్పవు. ఏసీ, కూలర్, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తికానవస్తుంది. కోర్టు వ్యవహారాలలో వాయిదాపడుట మంచిది. రవాణా రంగంలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికం. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
తుల : ఉద్యోగస్తులు సమర్థంగా పని చేసి అధికారులను మెప్పిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధికై చేయు యత్నాలు ఫలిస్తాయి. సేవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోపంతో పనులు చక్కబెట్టలేరు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. 
 
వృశ్చికం : వస్త్ర, బంగారు, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారస్తులకు సంతృప్తి, పురోభివృద్ధిని పొందుతారు. ఆకస్మికంగా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్న చోటికి బదిలీలు, ప్రమోషన్లు పొందుతారు. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. 
 
ధనస్సు : గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకేకాలంలో అనేక పనులు చేపట్టుట వల్ల దేనిలోనూ ఏకాగ్రత వహించలేరు. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. 
 
మకరం : కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు. వ్యాపార మార్పులపై చేయు యత్నాలు ఫలిస్తాయి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. 
 
కుంభం : బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి. 
 
మీనం : భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన లోపం, తోటివారి సహకారం లభిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. ఆడిటర్లు అసాధ్యమనుకున్న కేసులు సునాయాసంగా పరిష్కరిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-04-2020 బుధవారం దినఫలాలు : సత్యదేవుని పూజిస్తే...