Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో షో ఏపీ సర్కారు అనుమతి : నెలాఖరు నాటికి శుభం కార్డు : చిరంజీవి

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (16:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు సమ్మతించిందని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. అలాగే, అన్ని సమస్యలకు ఈ నెలాఖరులోగా శుభం కార్డు పడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యూంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో తెలుగు హీరోలు చిరంజీవి, మహేషఅ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ తదితరులు సమావేశమయ్యారు. ఆ త ర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు తమను ఆహ్వానించినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు పరిశ్రమ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. సీఎం నిర్ణయం మమ్మల్ని అందర్నీ సంతోషపరిచిందన్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై నెలాఖరులోగా శుభంకార్డు పడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా, చిన్న సినిమాలపై సీఎం జగన్ దృష్టిసారించారని చెప్పారు. ఈ సినిమాలు కూడా విజయవంతం కావాలన్న ఉద్దేశ్యంతో ఆయన మా అందరి కోరికను మన్నించి ఐదో ఆటకు అనుమతించారు. దీని వల్ల చిన్న నిర్మాతలకు, ఇతరులకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది అని చెప్పారు. అలాగ, విశాఖపట్టణంలో తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందాలని ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చెప్పారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments