Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ హీరో తో గ్లామ‌ర్‌, సాంప్ర‌దాయాన్ని పంచ‌నున్న హీరోయిన్లు

Advertiesment
బిగ్ హీరో తో గ్లామ‌ర్‌, సాంప్ర‌దాయాన్ని పంచ‌నున్న హీరోయిన్లు
, గురువారం, 10 ఫిబ్రవరి 2022 (11:02 IST)
Pooja Hegde, Rashmika
ఇటీవ‌ల పూజా హెగ్డే క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అల‌వైకుంఠ‌పురంలో సినిమా నుంచి ఆమె చేస్తున్న సినిమాలు క్రేజ్‌లో వున్నాయి. ఇక ప్ర‌భాస్‌తో రాబోయే రాధేశ్యామ్ క‌నుక రిలీజ్ అయితే మ‌రింత‌గా పేరు వ‌స్తుంద‌నే విష‌యం తెలిసిందే. తాజాగా ఆమె మ‌రో సినిమాలో బుక్ అయిన‌ట్లు తెలిసింది. వంశీ పైడి ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ సినిమాలో రూపొంద‌నున్న సినిమా అది. విజ‌య్ థ‌ల‌ప‌తి క‌థానాయ‌కుడు. ఆయ‌న ఎప్ప‌టినుంచో తెలుగు సినిమాలో న‌టిస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఎట్ట‌కేల‌కు అది ద్విబాషా చిత్రంగా కార్య‌రూపం దాల్చింది. విజ‌య్‌కు 66 సినిమా కావ‌డం విశేషం.
 
ఈ చిత్ర క‌థ‌ప్ర‌కారం ఇద్దరు హీరోయిన్లు కావాల‌ని తెలుస్తోంది. ఒక‌రు గ్లామ‌ర్‌, మ‌రొక‌రు సాంప్ర‌దాయం లుక్ వున్న హీరోయిన్లు కావాల‌ట‌. ఇందుకు ఇటీవ‌లే న‌లుగురుని అనుకున్నారు. అందులో ఇద్ద‌రిని ఫైన‌ల్ చేయ‌వ‌చ్చ‌ని  స‌మాచారం. వారిలో పూజా హెగ్డే,   రష్మికా మందన్నా వున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే విజ‌య్ న‌టించిన   “బీస్ట్” రిలీజ్ కి రెడీగా ఉంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. లక్కీ హీరోయిన్‌గా రష్మికా మందన్నాను తెలుగు ప‌రిశ్ర‌మ చూస్తోంది. క‌నుక వీరిద్ద‌రు ఖ‌న్‌ఫార్మ్ అయ్యార‌నే అనిపిస్తుంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటి సమాజంలో విడాకులు ఓ సర్వసాధారణం : హీరో సుమంత్