Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ప్రజల దత్త పుత్రుడిని.. డూడూ బసవన్నలా మీరేం చేసినా తల ఊపాలా?

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (16:06 IST)
ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తామేదో వారిని రెచ్చగొడుతున్నట్టు వచ్చిన వార్తలపై పవన్ ఫైర్ అయ్యారు. పీఆర్సీ అంశం ఉద్యోగులు ఎవరికీ సంతృప్తి ఇవ్వలేదన్నారు పవన్. అదే విషయాన్ని తాము చెప్పామని గుర్తు చేశారు. 
 
ప్రభుత్వంపై ఎవరైనా సహేతుక విమర్శలు చేస్తే దాన్ని స్వీకరించకుండా మాపై దాడి చేశారన్నారు. సీపీఎస్ అంశం ఎన్నికల హామీ అన్నారు పవన్, లక్షలాదిమంది ఉద్యోగులు కడుపుమండి రోడ్ల మీదకు వస్తే దానికి కారణం మేం కాదన్నారు.
 
డూడూ బసవన్నలా మీరేం చేసినా తల ఊపాలి. టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు వెళితే మాకేం సంబంధం. వెటకారాలతో ఏం జరగదు. మంచి జరిగేది చూడండి. మీకు నచ్చని సలహాలిస్తే న్యాయవ్యవస్థలోని న్యాయమూర్తులపై కూడా వైసీపీ నేతలు విమర్శలు చేశారని మండిపడ్డారు పవన్.
 
పీఆర్సీ, ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అంశం తాము సృష్టించింది కాదన్నారు. ఆధిపత్య ధోరణి అనే పదం ప్రభుత్వ సలహాదారు సజ్జల గారికి నచ్చినట్టు లేదు. ఉద్యోగుల్ని ముందే పిలిచి చర్చించి వుంటే విపక్షాలు మాట్లాడే అవకాశం వుండేది కాదన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను, డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి వుండాల్సిందన్నారు.
 
పీఆర్సీ విషయంలో జనసేనపై, తనపై చేస్తున్న కామెంట్లపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను ప్రజల దత్తపుత్రుడిని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments