Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెణికిన న‌రం... మెగా స్టార్ చిరంజీవి చేతికి శస్త్ర చికిత్స

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (09:56 IST)
అపోలో ఆస్పత్రిలో మెగాస్టార్​ చిరంజీవికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. అపోలో ఆస్పత్రిలో ఆయన కుడిచేతి మణి కట్టుకి సర్జరీ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. త‌న‌కు గ‌త కొద్ది రోజులుగా కుడి చేయి నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించామని, మ‌ణికట్టు దగ్గరున్న నరం మీద ఒత్తిడి పడిందని డాక్ట‌ర్లు చెప్పార‌ని చిరంజీవి వివ‌రించారు.
 
అపోలో ఆస్పత్రిలో త‌న కుడి చేతికి వైద్యులు శస్త్ర చికిత్స చేశార‌ని చెప్పారు. మీడియన్ నర్వ్ టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేశార‌ని, శస్త్ర చికిత్స జరిగిన 15 రోజులకు కుడి చేయి యథావిధిగా పని చేస్తోంద‌న్నారు. చిరంజీవి హీరోగా గాడ్ ఫాద‌ర్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇపుడు చిరంజీవి చేతికి శ‌స్త్ర చికిత్స కార‌ణంగా ఆయ‌న మ‌రో 15 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. ప‌దిహేను రోజుల త‌ర్వాత త‌ను య‌ధావిధిగా షూటింగ్ లో పాల్గొంటాన‌ని చిరంజీవి మీడియా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments