Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినతో గొడవపడిన మరిది.. కత్తితో దాడి చేశాడు..

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (12:12 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వదినతో గొడవపడిన మరిది ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వదిన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మీర్‌పేట ప్రగతినగర్‌కు చెందిన మరక మంజులాదేవి (37) జలమండలిలో డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పని చేసేది. ఆమె భర్త విష్‌దేవ్‌లో అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె వరణియ తేజ, అత్త జ్యోతితో కలిసి ఉంటోంది.
 
గురువారం ఉదయం మరిది నారదేవ్‌తో ఇంట్లో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఆగ్రహానికి లోనైన నారదేవ్‌ కత్తితో మంజులాదేవిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. 
 
దీనిని గుర్తించిన అమె కుమార్తె సమీపంలో ఉంటున్న మంజులాదేవి సోదరికి సమాచారం అందించడంతో వారు ఆమెను చికిత్స నిమిత్తం అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments