Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య సర్పంచ్‌గా గెలిచిందనీ.. 120 మందికి గుండు కొట్టించిన భర్త

Medak
Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (14:59 IST)
ఎన్నికల్లో పోటీ చేసే నేతలు తమ గెలుపు కోసం మొక్కని దేవుళ్ళు ఉండరు. అలాగే, వారు ఇవ్వని హామీలంటూవుండవు. గెలిచిన తర్వాత మొక్కులు తీర్చేవారు, ఇచ్చిన హామీలు నెరవేర్చేవారు ఎంతమందో ఉంటారో తెలియదు. కానీ, ఈ మహిళా సర్పంచ్ భర్త మాత్రం తన మొక్కును తీర్చుకున్నాడు. మొక్కు చెల్లింపులో భాగంగా తనతో పాటు మొత్తం 120 మందికి గుండు చేయించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. ఈ ఎన్నికల్లో మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్‌గా శ్రీనివాస్ అనే వ్యక్తి భార్య స్వరూప పోటీ చేసింది. ఈమె గెలిస్తే తిరుపతికి వస్తానని మొక్కుకున్నాడు. 
 
ఆ తర్వాత ఎన్నికల్లో స్వరూప గెలుపొందడం జరిగింది. ఇక ఆమె భర్త శ్రీనివాస్ మొక్కు తీర్చుకునే వంతు వచ్చింది. ఇందుకోసం తనతో పాటు.. గ్రామంలోని 120 మందిని తీసుకుని మూడు బస్సుల్లో తిరుపతికి చేరుకున్నారు. అక్కడ వారందరికీ తన సొంత ఖర్చులపై గుండ్లు కొట్టించాడు. అలా సర్పంచ్ భార్య స్వరూప భర్త శ్రీనివాస్ వార్తలకెక్కాడు. 
 
దీనిపై గ్రామ ప్రజలు స్పందిస్తూ, ఎన్నికల సమయంలో వందో.. వెయ్యో చేతిలో పెట్టి తర్వాత మరిచిపోయే ఈరోజుల్లో.. గెలిచాక తమ అందరిని తిరుపతి తీసుకెళ్లి వెంకన్న దర్శనం చేయించడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీనివాస్ వంటి వ్యక్తులు నేటి రాజకీయాల్లో చాలా అరుదుగా మాత్రమే ఉంటారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments