Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలంపురంలో కుమారి అనుమానాస్ప‌ద మృతి.... వెనుక ఎవ‌రి హ‌స్తం?

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (19:03 IST)
డలం 
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ఆలంపురం గ్రామంలో మహిళ ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె పేరు దేవేళ్ళ మేరీ ప్రసన్న కుమారి(30). ఆలంపురం గ్రామానికి చెందిన ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి మరో వ్యక్తి కలిసి మృతి చెందిన మహిళ దగ్గర అప్పులు తీసుకుని ఆమెను వేధింపులకు గురిచేయడంతో ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం.
 
 
ఆమె మృతికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తి ఆలంపురం గ్రామానికి చెందిన ప్రతిపక్ష నేత కలిసి ఆమె మృతికి కారణమయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. నిందితులకు ఊరిలో రాజకీయ అండదండలు ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చేందుకు మృతురాలి బంధువులు సాహసించడం లేదు. గతంలోనూ ఇదే వ్యక్తుల వల్ల ఆలంపురం పలు మహిళలు ఇదే స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. 
 
 
మృతురాలు వాయిస్ పేరుమీద ఓ ఆడియో రికార్డు బయటకు వచ్చింది. అందులో ఆమెను భయపెట్టి వాయిస్ చెప్పించారని ప్రచారం జ‌రుగుతోంది. ఆమె బంధవులను భయపెట్టి విషయం బయటకు పొక్కకుండా చేసారంటూ ఆరోపణలు వ‌స్తున్నాయి. ఇటువంటి ఘటనలకు కారణమయిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలంపురం గ్రామ వాసులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments