Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇక మండల స్థాయిలోనే పెళ్లిళ్లకు అనుమతి

Webdunia
శనివారం, 18 జులై 2020 (20:58 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా పెళ్లిళ్ల అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఇప్పటివరకు జిల్లా కలెక్టరేట్‌ల నుంచి పెళ్లిళ్లకు అనుమతి పొందాల్సి వచ్చేది. 
 
అయితే ఆ ప్రక్రియ కాస్తా ఆలస్యం అవుతుండటంతో.. మండల పరిధిలోని స్థానిక తహసీల్డార్లకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. జూలై 21 నుంచి శ్రావణ మాసం మొదలు అవుతుండటంతో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
 
కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని..మరే ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 
 
వధువు- వరుడు తరుపున 20 మంది మాత్రమే హాజరు కావాలని ప్రభుత్వం పేర్కొంది. ఇక పెళ్ళికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేవారు వివాహానికి హాజరయ్యే 20 మంది వివరాలతో పాటు పెళ్లి పత్రిక, ఆధార్ కార్డు, కరోనా రిపోర్టులతో పాటు రూ. 10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్డార్‌కు సమర్పించాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments