ఏపీలో రేషన్ సరుకుల పంపిణీ విధానంలో భారీ మార్పు నెలకొననుంది. ఇప్పటివరకు రేషన్ పంపిణీలో బియ్యంతోపాటు కందిపప్పు, లేదా శనగలు ఇస్తూ వచ్చారు. ఈసారి బియ్యం మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాస్తవానికి జులై నెల నుంచే నగదుకే సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే నవంబరు వరకు రేషన్‌ను ఉచితంగా ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేషన్ సరుకులను ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో జులైకు సంబంధించిన మొదటి విడత పంపిణీలో బియ్యం, కందిపప్పులను ఉచితంగా పంపిణీ చేశారు. కాగా.. ఈ నెల 18వ తేదీ నుంచి రెండో విడత రేషన్ పంపిణీలో కందిపప్పు లేకుండా కేవలం బియ్యాన్ని మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.