Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడిని మందలించిన పాపానికి తండ్రి హత్య

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (14:29 IST)
చెడు వ్యసనాలకు అలవాటు పడిన కుమారుడిని మందలించిన పాపానికి తండ్రి హత్యకు గురైనాడు. మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న కన్న తండ్రినే కొడుకు కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఈ హృదయ విధారక ఘటన జిల్లా వాసులను తీవ్రంగా కలచి వేసింది. 
 
కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కోసిగి నాల్గవ వార్డులో అల్లమ్మ, వీరయ్య దంపతులు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. వీరి పెద్దకుమారుడు నరసింహులు చదువు మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మద్యంకు బానిస అయ్యాడు.
 
నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి ఆ మత్తులో తల్లిదండ్రులను వేధించేవాడు. కొడుకుకు బుద్ది చెప్పాలని తండ్రి వీరయ్య కొడుకు నరసింహులను పలుమార్లు మందలించాడు.
 
ఇలా తరచూ తండ్రి మందలిస్తుండడంతో మద్యం మత్తులో గొడ్డలితో తండ్రి గొంతుపై నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడును అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments