Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నల్లగా ఉన్నావంటూ భర్త వేధింపులు.. గొడ్డలితో నరికి చంపిన భార్య

Advertiesment
murder
, బుధవారం, 28 సెప్టెంబరు 2022 (13:27 IST)
నల్లగా ఉన్నావంటూ భర్త వేధించడాన్ని భరించలేని ఓ భార్య దారుణానికి తెగబడింది. కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికివేసింది. అప్పటికీ శాంతించని ఆమె భర్త మర్మాంగాన్ని కోసేసింది. ఈ దారుణం ఛత్తీ‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు అమలేశ్వర్ గ్రామమంలో అనంత్ (40), సంగీత అనే దంపతులు నివసిస్తున్నారు. అయితే, సంగీత నల్లగా ఉంటుంది. దీంతో ఆమెను భర్త వేధించసాగాడు. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 
 
ఈ క్రమంలో గత ఆదివారం సైతం మరోమారు గొడవపడ్డారు. దీంతో నిగ్రహం కోల్పోయిన సంగీత భర్తను ఇంటిలో ఉన్న గొడ్డలిని తీసుకుని భర్తపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అనంత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆ తర్వాత ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు తన భర్తను ఎవరో హత్య చేశారంటూ గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సంగీతను అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారు : మంత్రి అంబటి రాంబాబు