Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఐసోలేషన్ వార్డ్ లో 'మైత్రీ'

Webdunia
ఆదివారం, 24 మే 2020 (23:26 IST)
సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్, హర్షా అకాడమీ వారి సం యుక్త  ఆధ్వర్యంలో రూపొందించబడిన ''మైత్రీ'' అనబడే రోబోను ఆదివారం కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్  ఆవిష్కరించారు. 
 
ఈ రోబోను హైదరాబాద్ కు చెందిన 'సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్ ' చైర్మన్  ఫణికుమార్  ఆధ్వర్యంలో ఆ సంస్థ టెక్నికల్ హెడ్ దుర్గాప్రసాద్ రూపొందించారు. ఈ రోబోను ముఖ్యంగా ఐసోలేషన్ వార్డ్ లో చికిత్సపొందుతున్న కరోనా భాధితుల సహాయార్థం రూపొందించటం జరిగినట్లుగా దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.
 
మైత్రీ రోబోను ఆదివారం హార్ష అకాడమీ డైరెక్టర్   తనూజ్ కుమార్  కలెక్టర్ ఇంతియాజ్ కు అందచేసారు.ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యసేవలకు  ఎంతగానో ఉపయోగపడే రోబోను తయారుచేసి అందచేసినందుకు సర్క్యూట్ గ్రిడ్  ను, హర్షా అకాడమీ వారిని కలెక్టర్ అభినందించారు.

జిల్లాలో వీటిని వినియోగిo చుకునేందు రెండు రోబోలను ఉచితంగా అందించిన హర్ష అకాడమీ, సర్క్యూట్ గ్రిడ్ వారిని కలెక్టర్ అభినందించారు.

ఈ సంధర్భంగా రోబో పనితీరును  సర్క్యూట్ గ్రిడ్ టెక్నికల్ హెడ్ దుర్గాప్రసాద్ వివరిస్తూ ఈ మైత్రీ రోబో వైఫై టెక్నాలజీతో పనిచేస్తుందనీ, దీనిని 20 అడుగుల దూరం నుండి  మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తూ కరోనా రోగులకు ఆహారం ,మందులు అందించవచ్చని, తద్వారా వైద్యసిబ్బంది కరోనా వైరస్ బారినపడకుండా కాపాడవచ్చని  తెలిపారు.

తమసంస్థ సర్క్యూట్ గ్రిడ్ రోబోల తయారీనే కాకుండా హోం ఆటోమేషన్ ఇండస్ట్రీలో కూడా సేవలు అందిస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments