Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ బీటెక్ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్… ఇంటి నుంచే ఎగ్జామ్స్

Webdunia
ఆదివారం, 24 మే 2020 (23:23 IST)
కరోనా కార‌ణంగా అక‌డ‌మిక్ ఇయ‌ర్ నష్టపోకుండా ఉండేందుకు నిట్‌, ఐఐటీలు.. బీటెక్ ఫైన‌ల్ ఇయ‌ర్ స్టూడెంట్స్ కు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఇళ్ల వద్దనున్న స్టూడెంట్స్ అక్కడి నుంచే ఎగ్జామ్స్ రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

పరీక్షల నిర్వహణలో ఆల‌స్యం జరిగితే ప్లేస్మెంట్స్ పొందిన‌వారు.. ఉన్నత చ‌దువుల‌కు వెళ్లాల్సినవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఎగ్జామ్స్ కు ఐఐటీ తిరుపతి, తాడేపల్లిగూడెం నిట్ స్పెష‌ల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి.

తాడేపల్లిగూడెం నిట్..ఫైన‌ల్ ఇయ‌ర్ స్టూడెంట్స్ కు జూన్‌ 1 నుంచి ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహించనుంది. కాలేజీల్లో నిర్వహించిన మిడ్‌, మైనర్ ఎగ్జామ్స్ కు 75% వెయిటేజ్‌ ఇస్తారు. మిగతా 25% మార్కులకు మాత్రమే ఇప్పుడు ఎగ్జామ్ పెడ‌తారు. దీనిలో జంబ్లింగ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు.

స్పెష‌ల్ సాఫ్ట్‌వేర్‌తో విద్యార్థి తన కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ఫోన్‌లో కెమెరా ఆన్‌ చేస్తేనే క్వ‌చ్చ‌న్ పేప‌ర్ డౌన్‌లోడ్‌ అవుతుంది. ఈ కెమెరా స్టూడెంట్ ను పరిశీలిస్తూ ఉంటుందని అకడమిక్‌ డీన్‌ బీఆర్‌కే శాస్త్రి తెలిపారు. రెండు, మూడో సంవత్సరం స్టూడెంట్స్ కు మాత్రం ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
 
ఐఐటీ తిరుపతిలో క్వ‌చ్చ‌న్స్, ఆన్స‌ర్స్ రూపంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇవి జూన్ ఫ‌స్ట్ వీక్ లో ప్రారంభం కానున్నాయి. కరోనావైర‌స్ నేప‌థ్యంలో.. స్టూడెంట్స్ ఒకచోటకు వచ్చి ఎగ్జామ్స్ రాసే అవకాశం లేకపోవడంతో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఐఐటీ తిరుపతి సంచాలకులు సత్యనారాయణ తెలిపారు.

ఫైన‌ల్ ఇయ‌ర్ సెమిస్టర్‌ పరీక్షలకు విద్యార్థులకు ఉత్తీర్ణత, అనుత్తీర్ణత అని మాత్రమే ఇస్తారు. గ్రేడ్లు కేటాయించ‌రు. స్టూడెంట్స్ జవాబులను కంప్యూటర్‌పై టైప్‌ చేయాల్సి వస్తున్నందున కొంచెం ఎక్కువ స‌మ‌యం ఇవ్వ‌నున్నారు. విద్యార్థుల కదలికలను కంప్యూటర్‌లోని కెమెరా ద్వారా మోనేట‌ర్ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments