Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విజృంభణ.. తిరుమలలో ప్రధాన అర్చకులు మృతి

Webdunia
సోమవారం, 3 మే 2021 (22:39 IST)
కరోనా విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. అలాగే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా విజృంభిస్తోంది. అంతేగాకుండా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ దీక్షితులు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన కరోనా కరాణంగా చికిత్స పొందుతున్నారు. 
 
కరోనాకు చికిత్స తీసుకుంటూనే ఆయన తుది శ్వాస విడిచారు. నెల రోజుల కిందటే ఆయన్ను ఆలయ ప్రధాన అర్చకులుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. మళ్లీ పదవి వచ్చింది అన్న సంతోషం లేకుండా కరోనా కాటు వేసింది.
 
ముఖ్యంగా తిరుమల తిరుపతిపై కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది. కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో దర్శనాల సంఖ్యను కుదిరించారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో ఏప్రిల్ నెలలో భక్తుల సంఖ్యతో పాటు, ఆధాయం భారీగా తగ్గింది. ఏప్రిల్ నెల మొత్తం కలిపి కేవలం 9.05 మంది మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నట్టు అధికారులు ప్రకటించారు. అలాగే హుండీ ఆదాయం 62 కోట్ల 62 లక్షల రూపాయలు వచ్చిందన్నారు. 4.61 లక్షలమంది తల నీలాలు సమర్పించుకున్నారు. అంటే మార్చి నెలతో పోలిస్తే ఆదాయం సగానాకి సగం పడిపోయింది. 
 
తాజా పరిణామంతో తిరుమలలో ఆంక్షలను మరింత కఠినంగా చేసే అవకాశం ఉంది. మరోవైపు తిరుమలలో భారీగా కేసులు పెరుగుతుండడంతో మరోసారి ఆలయాన్ని పూర్తిగా మూసివేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. సాధరణంగా ఏపీ వ్యాప్తంగా చూస్తే.. చిత్తూరు జిల్లాల్లోనే అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి.
 
ప్రతి రోజూ క్రమం తప్పకుండా 1500లకు పైగా మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే అందులో సగానికి పైగా కేసులో తిరుపతిలోనే నమోదు అవుతున్నవి.. అయితే అవన్నీ తిరుమల కారణంగా నమోదవుతున్న కేసులే అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మరోసారి ఆలయాన్ని మూసేయాలనే డిమాండ్ ఊపందుకుంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments