Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహాభారతంలో లాక్‌డౌన్.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా..? (video)

Advertiesment
మహాభారతంలో లాక్‌డౌన్.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా..? (video)
, గురువారం, 29 ఏప్రియల్ 2021 (20:03 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్లు, లాక్ డౌన్ గురించే చర్చ సాగుతోంది. అలాంటి ఈ లాక్ డౌన్ ప్రస్తావన.. మహాభారతంలోనే వుందని తెలిసింది. మహాభారత యుద్ధంలో లాక్ డౌన్ గురించి ప్రస్తావన వుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మహాభారత యుద్ధంలో తన తండ్రి ద్రోణాచార్యుడిని చంపడంపై ద్రోణుని కుమారుడు అశ్వత్థామ ఆగ్రహావేశానికి గురయ్యాడు. అతను పాండవ సేనపై ఆవేశంతో నారాయణ అస్త్రాన్ని ప్రయోగించాడు. దీనికి మరో ఉపాయం లేదు. 
 
ఈ అస్త్రం యుద్ధానికి సిద్ధమయ్యే వారిపై, ఆయుధం చేతబూనిన వారిని హతమార్చుతుంది. ఇంకా అగ్ని వర్షాన్ని కురిపిస్తుంది. దీంతో మరణం తప్పదు. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని, ఆయుధాలను దాచి అందరినీ వారి వారి గృహాలకే పరిమితం చేశారు. అంతేగాకుండా నారాయణ అస్త్రం దగ్గరికి వస్తే చేతులు కట్టుకుని నిలబడమని ఆదేశించాడు. 
 
అంతేగాకుండా మనస్సులో యుద్ధం చేసే యోచన కూడా రాకూడదని.. అందరూ తమ ఆయుధాలకు దూరంగా గృహాలకే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశాడు. అలా నారాయణ అస్త్రం తన సమయం ముగిసిన పిమ్మట శాంతించింది. ఈ విధంగా నారాయణ అస్త్రం నుంచి శ్రీకృష్ణుడు పాండవ సేనను రక్షించాడు. ఈ పద్ధతే ప్రస్తుతం కరోనాకు వర్తిస్తుంది. లాక్ డౌన్‌లలో ప్రస్తుతం ప్రజలంతా చాలామటుకు ఇంటికే పరిమితం అయ్యారు. 
 
కరోనాతో యుద్ధం చేయలేక తమను తాము రక్షించుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో యుద్ధం చేయలేక జనం వ్యాక్సినేషన్ల కోసం వేచి చూస్తున్నారు. శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లు చేస్తూ కాలం గడుపుతున్నారు. కరోనాపై అస్త్రం ప్రయోగించలేకపోతున్నారు. 
 
కరోనా నుంచి తప్పించుకోవడం కోసం కొద్దికాలం అన్నీ పనులను వదిలి ప్రశాంతంగా మనస్సును సిద్ధం చేసుకుంటున్నారు. ఒత్తిడికి దూరం అవుతున్నారు. ఇంటికే పరిమితమై కరోనా నుంచి తప్పించుకునే దిశగా ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తున్నారు.  అదన్నమాట సంగతి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-04-2021 గురువారం దినఫలాలు - కనకధారా స్తోత్రం పఠిస్తే...