ప్రభాస్ - రామ్ చరణ్ - మహేష్ - ఎన్టీఆర్ - రాం చరణ్‌లు నా కంటే పెద్ద హీరోలు.. పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (09:56 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ హీరోలు ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు తన కంటే పెద్ద హీరోలు, తనకంటే అధిక పారితోషికం తీసుకుంటారని, ఈ విషయాన్ని మీ అందరి ముందు చెప్పడానికి తనకు ఎలాంటి భేషజం (ఈగో) లేదని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
తాను చేపట్టిన వారాహి విజయ యాత్రలో భాగంగా, ఆయన బుధవారం రాత్రి కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగింస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. జనసేన సైనికుల్లో అందరి హీరోలకు చెందిన అభిమానులు ఉన్నారన్నారు. అయితే, సినీ అభిమానం వేరు, రాజకీయాలు వేరన్నారు. రాష్ట్ర భవిష్యత్‌తో మీ భవిష్యత్ కోసం అందరి హీరోల అభిమానులు తనకు అండగా ఉండాలని కోరారు. 
 
అందరి హీరోలంటే నాకు ఎంతో అభిమానం. వారితో కలిసి మాట్లాడుతాను. సినిమాలు చూస్తాను. సినిమాల్లో ఇష్టాలు వేరు. రాజకీయాలు వేరు. ప్రభాస్ నాకంటే గొప్ప పాన్ ఇండియా హీరో. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు గ్లోబల్ స్టార్లుగా ఎదిగారు. వారు నా కంటే ఎక్కువ పారితోషికం తీసుకోవచ్చు. కానీ, మా మధ్య ఎలాంటి భేషజాలు లేవు. అందువల్ల ప్రతి ఒక్క హీరో అభిమాని వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ, తనకు అండగా ఉండాలని ఆయన కోరారు. 
 
ఇకపోతే, సీఎం జగన్‌ విచక్షణ, వివేకం లేని వ్యక్తి అని పవన్ దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటి కావాలని అభిప్రాయపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాను ఇప్పటికే మూడు సార్లు సమావేశమయ్యానని చెప్పారు. అయితే, ఆ భేటీల్లో ఎన్నికల్లో పంచుకునే సీట్ల గురించి కాకుండా రాష్ట్ర అంశాలపైనే చర్చ జరిగిందని వెల్లడించారు. పొత్తు కుదిరితే ఎన్ని సీట్లు అడుగుతామనేది ఇంతవరకు టీడీపీతో చర్చించలేదని పవన్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments