Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ సీపీకి వైఎస్ జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు...

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (09:37 IST)
తమ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్ఆర్సీపీ) తమకు తెలియజేసిందని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పార్టీ పేరు సవరణ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌కు శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్‌ రెడ్డిని ఎన్నుకున్నట్లు పత్రికల్లో వచ్చిందని, పార్టీ వైపు నుంచి ఎటువంటి ప్రకటన లేనందున దానిపై స్పష్టత ఇవ్వాలంటూ ఎంపీ రఘురామ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈసీఐకి లేఖ రాశారు. 
 
దీనిపై స్పందించిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆ పార్టీ ఇచ్చిన సమాచారాన్ని పేర్కొంటూ రఘురామకు లేఖను పంపించింది. అలాగే తమ పార్టీ పేరును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేదా వైఎస్సార్‌సీపీగా మార్చే ప్రతిపాదన, ఆలోచన తమకు లేదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ వివరించిందని కూడా ఆ లేఖలో ఈసీఐ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ సన్నివేశంలో గాయపడ్డా షూట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ

సత్య దేవ్, ప్రియా భవానీ శంకర్ 'జీబ్రా' ఫస్ట్ సింగిల్ రిలీజ్

సాయి దుర్గ తేజ్18లో వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు

మహా శివరాత్రికి నితిన్, దిల్ రాజు కాంబినేషన్ మూవీ తమ్ముడు సిద్ధం

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ చిత్రం పేరు ఘాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments