Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదిపురుష్‌ ఓంరౌత్‌ రామాయణం, హిందూ ధర్మాన్ని దెబ్బతీయడానికే తీశాడా!

Advertiesment
Omraut Ramayanam
, మంగళవారం, 20 జూన్ 2023 (12:30 IST)
Omraut Ramayanam
సినిమాకు మూలం పురాణాలే. ఆ తర్వాత సాంఘికాలు అయ్యాయి. రామాయణ, మహాభారతాలు సినిమాలుగా దేశంలోని పలు భాషల్లో వచ్చేశాయి. వాటిని ప్రజలు ఆస్వాదించారు. అయినా రామాయణం రంకు, భారతం బొంకు అంటూ వితండవాదులు పెట్రేగిన సందర్భాలు చాలా వున్నాయి. అయినా హరేరామ్‌ అంటూ దేశంలో చాలాచోట్ల రాముడ్ని తలచుకుంటూ జీవితాన్ని ఆరంభిస్తారు. ఫోన్‌ చేసిన హేరామ్‌ అంటూ పలుకుతారు. అంతలా జీర్ణించుకుపోయినందుకువల్లే దాన్ని బేస్‌చేసుకుని హిందూత్వా పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఇప్పటికే రాముడిని ఆదర్శంగా తీసుకుంటూ కోట్లమంది మాట్లాడుతుంటారు. అలాంటి రామాయణాన్ని ఆదిపురుష్‌ పేరుతో ఓంరౌత్‌ అనే దర్శకుడు టిసీరిస్‌ వంటి నిర్మాణ సంస్థలు కలిపి తీశారంటే ఎంతో హుందా వుంటుందని అనుకున్నారు.
 
ఇక సినిమా టీజర్‌ విడుదలయ్యాక అందరూ పెదవివిరిచారు. ట్రైలర్‌ వచ్చాక పర్వాలేదు అంటూ కొంతమంది పనికట్టుకుని సినిమాను మోశారు. రాముడికి మీసాలు వుంటాయా? అంటూ చర్చ లేవనెత్తారు. దీనికి తన సినిమానే సమాధానం అంటూ ఓంరౌత్‌ చెబుతూనే వున్నారు. ఇక ఆయన అన్నట్లు సినిమా విడుదలయ్యాక ఇది రామాయణమా? అంటూ అందరూ ముక్కుమీద వేలేసుకునేలా చేసింది.
 
సినిమా టైటిల్‌కుముందే ఇది వాల్మీకి రామాయణం కాదు. కల్పితం. అంటూ ఇది తన స్వంత రామాయణం అనేలా అర్థం కలిగించేలా ప్రకటన వేశాడు. దీనికోసం 500 కోట్లు వెచ్చిండం ఆశ్చర్యంగా వుంది. సినిమా విడుదలకుముందు ప్రతి దేవాలయంలో ఉచితంగా సినిమా టికెట్లు అందజేశారు. స్కూల్స్‌లోనూ పిల్లలకు షోలు ప్రదర్శించారు. దానితోనే సినిమా ఢమాల్ అనే అనుమానం వచ్చేసింది. తెలిసిన కథను సినిమాగా తీయడం చాలా సాహసం. అందులోనూ ప్రజలు ఆరాదించే శ్రీరాముడు, సీత కథను అసంబద్ధంగా తెరకెక్కించాడు. 
 
ధర్మం అంటే రాముడే. ఎలా నడుచుకున్నాడు అన్నది రామాయణం. మానవుడిగా వచ్చి ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేది సినిమాలో చూపించాలి. కేవలం మాయలేడీకోసం రాముడు వెళ్లఢం, ఆ తర్వాత రావణాసురుడు సీతను ఎత్తుకువెళ్ళిప్పుడు రాముడు పరుగెత్తుకుంటూ చూస్తుంటాడు మినహా బాణం కూడా వేయడు. అసలు ఇది కథకాదే. తన స్వంత రామాయణాన్ని కొత్త కథను తీశాడు. ఇక రావణాసురుడి సామ్రాజ్యం అనేది ఆంగ్ల సినిమా ఏప్‌ ఆప్‌ వార్‌ అనే సినిమాకు కాపీగా వుంది. అక్కడ మనుషులులాగే రాక్షసులు వుంటారు. కానీ ఎక్కడా ఆయన రాజ్యంలో ఒక్కరూ కనిపించరు. మండోదరి, శూర్పణక్క, విభీషనుడు, ఇంద్రజిత్‌, కుంభకర్ణుడు మినహా అందరూ గెరిల్లాలు వుంటాయి. వాటితోనే యుద్ధం చేస్తాడు. ఇలా ఎక్కడా పొంతనలేని రామాయణాన్ని తీసి ఇది ఆదిపురుష్‌ అనే గొప్ప సినిమాగా చెప్పుకోవడం విడ్దూరంగా వుందని తెలుగు సినీప్రముఖులు వాపోతున్నారు. ఎవరూ పైకి విమర్శించకపోయినా బయట మాత్రం చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. 
 
మన రామాయణం కథను ఇలా బ్రష్టుపట్టించి ఇతర మతస్థులు వేలెత్తి చూపేలా చేయడం దురదృష్టకరమనీ, ఇది తెలిసి చేసిందే. దీనివల్ల హిందూత్వంపై మరింత అపనమ్మకం కలుగుతుందని వాపోతున్నారు. ఇటీవలే బి.జె.పి సీనియర్ నారాయ్దకుడు రాజా సింగ్ కూడా తన కుటుంభం ట్ హోం సినిమా చూసి తీవ్ర విమర్శలు చేశారు. 
 
ఇంతలా రామాయణాన్ని భ్రస్టుపట్టించిన విధానాన్ని పాలకులకు రుచించలేదు. ఇక త్రిడీ సినిమా అని తీస్తే యానిమేషన్‌ సరిగ్గాలేదు. రాముడు, సీత నదిలో తెప్పపై కూర్చుని ప్రయాణిస్తుంటే అస్సలు అది కదలదు. చుట్టూ వున్న చెట్లు కదులుతుంటాయి. ఇంత నీచంగా వుందా టెక్నాలజీ అని వాపోతున్నారు. రామాయణం సినిమా చూస్తే భక్తిపారవశ్యం కలగాలి. అదేమీలేదు. ఛీత్కరించేదిగావుంది. రామాయణానికి చెడ్డపేరు తీసుకురావడం కోసమే చేసినట్లుగా వుంది. ఇలాంటి పౌరాణికం సినిమాలు తీయడానికి ఓంరౌత్‌ పనికిరాడు అని పలు షూటింగ్‌లోనూ చర్చ జరగడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరు కారం చాలా ఘాటు గురూ! షూటింగ్‌కు రాలేనన్న మహేష్‌బాబు?