Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రైనా రావాల్సిందే.. స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వదల్చుకోలేదు : ధర్మాబాద్ కోర్టు

బాబ్లీ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు తోసిపుచ్చింది. పైగా, కీలక వ్యాఖ్యలు చేసింది. బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసుపై ధర్మాబాద

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (13:16 IST)
బాబ్లీ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు తోసిపుచ్చింది. పైగా, కీలక వ్యాఖ్యలు చేసింది. బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసుపై ధర్మాబాద్‌ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఆ సమయంలో రీకాల్ పిటిషన్ తిరస్కరణకు గురైనందువల్ల కోర్టుకు హాజరయ్యేందుకు కొంతసమయం కావాలంటూ సీఎం తరపు న్యాయవాది కోరారు.
 
ఆ తర్వాత ధర్మాబాద్ కోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టానికి ఎవరూ మినహాయింపు కాదని, ముఖ్యమంత్రైనా.. ఎవరైనా కోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని, ఎవరికీ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వదల్చుకోలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు సహా 16 మంది నేతలు.. అక్టోబర్ 15న కోర్టులో హా1జరుకావాలని జడ్జి ఆదేశించారు.
 
మరోవైపు ఈ కేసులో వారెంట్ అందుకున్న అప్పటి తెలంగాణ టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నంకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాబాద్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments