Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాపై సుప్రీం సీరియస్.. సంచలనాల కోసం పాకులాడొద్దు..

లైంగిక వేధింపులపై మీడియా అత్యుత్సాహాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. బీహార్ వసతి గృహాల్లో వెలుగు చూసిన లైంగిక వేధింపుల ఘటనలపై వార్తలు రాయొద్దంటూ పాట్నా హైకోర్టు విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:35 IST)
లైంగిక వేధింపులపై మీడియా అత్యుత్సాహాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. బీహార్ వసతి గృహాల్లో వెలుగు చూసిన లైంగిక వేధింపుల ఘటనలపై వార్తలు రాయొద్దంటూ పాట్నా హైకోర్టు విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత్తివేసింది. లైంగిక దాడి, వేధింపుల కేసుల్లో మీడియా సంయమనం పాటించాలని, సంచలనాల కోసం పాకులాడకూడదని హెచ్చరించింది. 
 
వసతి గృహాల్లో వెలుగు చూసిన అంశాలపై వార్తలు రాయొద్దంటూ పట్నా హైకోర్టు విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ నివేదితా ఝా అనే పాత్రికేయురాలు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు మండిపడింది. 
 
ఈ పిటిషన్‌‌ను విచారించిన జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం.. ఓ వైపు కేసు నడుస్తుంటే మరో వైపు మీడియా తీర్పులు ఇవ్వడం సరికాదని సూచించింది. తప్పుతోవ పట్టించే వార్తల విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవనిపిస్తోంది. దీనిపై ఎడిటర్స్‌ గిల్డ్‌, ప్రెస్‌ కౌన్సిల్‌, ఎన్‌బీఎస్‌ఏకు సమాచారం అందిస్తామని జస్టిస్‌ లోకూర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం