Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయోధ్యలో రామమందిరం ఖాయం.. సుప్రీం కోర్టు మనదే.. ముకుత్ బిహారీ వర్మ

అయోధ్య రామమందిరం కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. విశ్వహిందూ పరిషత్ బహిష్కృత నేత ప్రవీణ్ తొగాడియా మోడీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. తన పార్టీ హిందువుల శ్రేయస్సు కోసం పనిచే

Advertiesment
Ram temple
, ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (16:57 IST)
అయోధ్య రామమందిరం కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. విశ్వహిందూ పరిషత్ బహిష్కృత నేత ప్రవీణ్ తొగాడియా మోడీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. తన పార్టీ హిందువుల శ్రేయస్సు కోసం పనిచేస్తూనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కృషి చేస్తుందని చెప్పారు. 
ఫోటో కర్టెసీ - ఇషా ఆర్గ్
 
సోమ్‌నాథ్ ఆలయం ఎలా అయితే నిర్మించారో అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం కొత్త చట్టం ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రామమందిరం నిర్మాణం చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పొందుపరిచిందని కానీ ఆ హామీని మరిచిందని తొగాడియా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం హిందూ ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని.. అదే రీతిలో రాముడిని కూడా మోసం చేసిందని తొగాడియా గతంలో మండిపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మంత్రి ముకుత్ బిహారీ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. ఎందుకంటే.. సుప్రీం కోర్టు తమదేనని వ్యాఖ్యానించారు. అభివృద్ధి అజెండాతో తాము అధికారంలోకి వచ్చినప్పటికీ, రామమందిర నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. యూపీలోని బహ్రెయిచ్ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ముకుత్ బిహారీ వర్మ మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కచ్చితంగా పూర్తవుతుందన్నారు.  
 
అయితే సుప్రీం కోర్టు మనదేనని ముకుత్ బిహారీ వ్యాఖ్యానించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టుకు మతం రంగు పులమడం ఏమిటని పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో శర్మ వెనక్కి తగ్గారు. సుప్రీం కోర్టు మనదే అని చెప్పడం అర్థం భారతీయులందరిది అని చెప్పడమేనని వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టుపై అందరికీ పూర్తి నమ్మకం ఉందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీస్ ఇన్‌స్పెక్టర్ కాదు.. ప్రజారక్షకుడు.. గ్రేట్ జాబ్ అంటూ కమిషనర్ కితాబు