Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వలింగ సంపర్కం నేరం కాదు : సుప్రీంకోర్టు తీర్పు

సంబారాల్లో స్వలింగ సంపర్కులు.. ఎందుకో తెలుసా? సెక్షన్ 377పై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. స్వలింగ సంపర్కం నేరం కాదని స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 377 పైన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర

Advertiesment
స్వలింగ సంపర్కం నేరం కాదు : సుప్రీంకోర్టు తీర్పు
, గురువారం, 6 సెప్టెంబరు 2018 (14:05 IST)
సంబారాల్లో స్వలింగ సంపర్కులు.. ఎందుకో తెలుసా? సెక్షన్ 377పై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. స్వలింగ సంపర్కం నేరం కాదని స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 377 పైన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపై ఎల్జీబీటీ సంబరాలు చేసుకుంది. ఇదో చారిత్రత తీర్పుగా అభివర్ణించింది. 
 
వ్యక్తిగత స్వేచ్ఛను అందరూ గౌరవించాలని చీఫ్ జస్టిస్ తన తీర్పులో వెల్లడించారు. లెస్బియన్స్, గేలకు సమాన హక్కులు ఉంటాయని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ వర్తిస్తుందని తెలిపారు. సెక్షన్ 377 ఏకపక్షంగా ఉందని, ఈ సెక్షన్‌లోకి గే సెక్స్ రాదని పేర్కొన్నారు. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కాన్నీ సెక్షన్ 377 నేరంగా పేర్కొంటుంది. ఈ సెక్షన్‌ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణను పూర్తి చేసింది.
 
స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న కార్యకర్తలు, వివిధ వర్గాల వాదనలను విన్న భారత అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చింది. 377 చట్టబద్ధతపై నిర్ణయాన్ని కేంద్రం కూడా అత్యున్నత న్యాయస్థానం విచక్షణకు వదిలేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో స్కలింగ సంపర్కులు సంతోషం వెళ్లబుచ్చుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దటీజ్ కేసీఆర్... తెలంగాణ అసెంబ్లీ రద్దుకు కేబినెట్ తీర్మానం...