Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యాటరింగ్ పేరుతో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. కాదంటే నరకమే...

క్యాటరింగ్ పేరుతో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించే ముఠాగుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. అశ్లీల నృత్యాలు చేసేందుకు నిరాకరిస్తే మాత్రం ఆ అమ్మాయిలకు నరకమే. ఇలా అమ్మాయిలను ట్రాప్ చేసే ముఠాకు చెందిన ఆర

Advertiesment
క్యాటరింగ్ పేరుతో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. కాదంటే నరకమే...
, శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (11:51 IST)
క్యాటరింగ్ పేరుతో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించే ముఠాగుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. అశ్లీల నృత్యాలు చేసేందుకు నిరాకరిస్తే మాత్రం ఆ అమ్మాయిలకు నరకమే. ఇలా అమ్మాయిలను ట్రాప్ చేసే ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఏపీ రాష్ట్ర వాణిజ్య నగరమైన విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లోని న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతానికి చెందిన తమ బాలిక కనిపించడం లేదని ఓ తల్లి ఇటీవల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అమ్మాయిల కిడ్నాప్‌ వెనుక ఉన్న గుట్టును కనుగొన్నారు. 
 
విజయవాడ నగరంలో పేదవర్గాలు అధికంగా నివసించే ఈ ప్రాంతాలపై ఓ ముఠా కన్నేసింది. 15, 16 ఏళ్ల వయస్సు ఉన్న బాలికలకు మాయమాటలతో వలేసింది. క్యాటరింగ్‌ పనులు ఇప్పిస్తామని నమ్మించి, తమతో తీసుకెళ్లింది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో జరిగే జాతరలు, ఉత్సవాల్లో వీరితో ఈ ముఠా అశ్లీల నృత్యాలు చేయించి, డబ్బులను తన జేబులో వేసుకుంటూ వస్తోంది. నృత్యాలు చేసేందుకు నిరాకరిస్తే మాత్రం వారికి నరకం చూపించేది. 
 
ఇలా విజయవాడ - విశాఖ నగరాల మధ్య కొంతకాలంగా సాగిపోతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు రట్టుచేశారు. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఆరుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ట్రాప్‌, కిడ్నాప్‌ సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి గుప్పిట్లో ఉన్న 15 మంది బాలికలకు పోలీసులు విముక్తి కలిగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయ నాయకుడితో వివాహేతర సంబంధం.. 150 సవర్ల బంగారంతో జంప్