Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? అయితే, ఆస్తులు అమ్మండి : కోర్టు ఆదేశం

కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వం వద్ద లేవంటే.. ప్రభుత్వ ఆస్తులు విక్రయించి ఆ డబ్బులు చెల్లించాలంటూ మంచిలీపట్నం కోర్టు సూచన చేసింది. ఇందులోభాగంగా, నీటిపారుదల శాఖకు చెందిన భూములను వేలం వే

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:48 IST)
కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వం వద్ద లేవంటే.. ప్రభుత్వ ఆస్తులు విక్రయించి ఆ డబ్బులు చెల్లించాలంటూ మంచిలీపట్నం కోర్టు సూచన చేసింది. ఇందులోభాగంగా, నీటిపారుదల శాఖకు చెందిన భూములను వేలం వేసేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
ప్రభుత్వం తనకు బకాయి పడిన రూ.407 కోట్లను చెల్లించాలంటూ మచిలీపట్నం న్యాయస్థానంలో పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేశారు. ఇవ్వాల్సిన అసలుకు రూ.122 కోట్ల వడ్డీ కలిపి.. రూ.407 కోట్లు ఇవ్వాలని 2016లో పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్‌పై అప్పటి నుంచి విచారణ జరుపుతూ వచ్చిన కోర్టు.. తాజాగా జరిగిన విచారణలో మచిలీపట్నం 10వ అదనపు జిల్లా కోర్టు జడ్జీ రజినీ కీలకమైన కామెంట్స్ చేశారు. వడ్డీతో సహా మొత్తం రూ.407 కోట్లు చెల్లించాల్సిందే తేల్చి చెప్పారు. 
 
ఇందుకోసం విజయవాడలో నీటిపారుదల శాఖకు చెందిన 24.71 ఎకరాల స్వరాజ్య మైదానం, జగ్గయ్యపేటలోని 17.80 ఎకరాల భూమిని వేలం వేసేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 10వ తేదీలోపు ఆస్తులకు సంబంధించిన మార్కెట్ విలువ పత్రాలను కోర్టుకు ఇవ్వాలని 10వ అదనపు జిల్లా జడ్జి రజిని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments