బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో వర్షాలే వర్షాలు...

ఠాగూర్
మంగళవారం, 12 ఆగస్టు 2025 (12:19 IST)
బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత అది వాయుగుండంగా బలపడి, శనివారం నాటికి తీరం దాటొచ్చని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్, ఇతర వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవొచ్చని భావిస్తున్నాయి. 
 
మరోవైపు రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. 
 
మంగళవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వానలు కురిశాయి. సోమవారం పల్నాడు, తూర్పుగోదావరి, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, బాపట్ల తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments