Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్‌ ప్రియురాలిపై కన్నేసిన దోస్త్.. రెండు హత్యలకు కారణమైన ఆ మహిళ...

హైదరాబాద్‌ నగరంలోని అత్తాపూర్ మెట్రో పిల్లర్ 139 వద్ద పట్టపగలు జరిగిన హత్యకు గల కారణాలను నిందితులు వెల్లడించారు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై తన వెంట ఉండే స్నేహితుడే కన్నేశాడు.

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:18 IST)
హైదరాబాద్‌ నగరంలోని అత్తాపూర్ మెట్రో పిల్లర్ 139 వద్ద పట్టపగలు జరిగిన హత్యకు గల కారణాలను నిందితులు వెల్లడించారు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై తన వెంట ఉండే స్నేహితుడే కన్నేశాడు. దీన్ని జీర్ణించుకోలేక స్నేహితుడుని చంపేశాడు. అతని తండ్రి కక్ష పెట్టుకుని ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
హైదరాబాద్ జుమ్మేరాత్‌ బజార్‌, ధూల్‌పేట్‌ ప్రాంతానికి చెందిన జెరిగళ్ల రమేశ్‌ గౌడ్‌ (24), వడ్డేగోని మహేశ్‌ గౌడ్‌ మంచి స్నేహితులు. అదేప్రాంతానికి చెందిన ఓ మహిళతో రమేశ్‌ గౌడ్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెపై మహేశ్‌ గౌడ్‌ కూడా కన్నేసి ఆమెను వేధించసాగాడు. మహేశ్ తనను వేధిస్తున్నాడన్న విషయాన్ని రమేశ్‌కు ఆ మహిళ చెప్పింది. 
 
దాంతో, మహేశ్‌కు అతను వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత రమేష్‌ను మహేశ్ బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. ఫలితంగా మహేష్‌ను అంతం చేయాలని రమేశ్ నిర్ణయించుకున్నాడు. ఇందులోభాగంగా, గత ఏడాది డిసెంబరు 24న మైసిగండిలో పార్టీ చేసుకుందామంటూ కారులో మహేశ్‌ను తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన తర్వాత తిరుగు ప్రయాణంలో శంషాబాద్‌ ప్రాంతానికి చేరుకున్నారు. 
 
మార్గమద్యంలో స్నేహితులతో కలిసి మహేశ్‌ గొంతుకు తీగ బిగించి రమేశ్‌ హత్య చేశాడు. అనంతరం కారును శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముచ్చింతల్‌ గ్రామానికి తీసుకెళ్లి మృతదేహాన్ని అక్కడ పడేసి నిప్పంటించాడు. కారును శంషాబాద్‌ తీసుకొచ్చి సర్వీసింగ్‌కు ఇచ్చాడు. 
 
కారులో రక్తం ఉండడాన్ని గమనించిన వాషింగ్‌సెంటర్‌ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో, రమేశ్‌ గౌడ్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన రమేశ్‌ కోర్టు వాయిదాలకు వెళ్లి వస్తున్నాడు. 
 
ఈ క్రమంలో రమేశ్‌ గౌడ్‌ బుధవారం ఉప్పర్‌పల్లిలోని రాజేంద్రనగర్‌ కోర్టు వాయిదాకు వచ్చాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అక్కడ కాపు కాసిన లక్ష్మణ్‌, కిషన్‌ అతనిని వెంటాడి.. వేటాడి హత్య చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments