Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడికి సర్వస్వం అప్పగించింది... లండన్ వెళ్లగానే మాయమైపోయాడు... వచ్చి చూస్తే...

ప్రియుడి కోసం అన్వేషిస్తూ ఇంగ్లాండ్ నుంచి ఇండియాకొచ్చింది ఆ యువతి. పెళ్లి చేసుకుంటానని ప్రవాస భారతీయురాలిని ప్రేమ పేరుతో మోసగించి పారిపోయాడు ఆ వంచకుడు. ఎన్నో రాష్ట్రాలకు వెళ్లి గాలించిన మీదట తన ప్రియుడు హైదరాబాద్‌లోనే ఉన్నట్టు చివరికి తెల్సుకుంది. ప్

ప్రియుడికి సర్వస్వం అప్పగించింది... లండన్ వెళ్లగానే మాయమైపోయాడు... వచ్చి చూస్తే...
, బుధవారం, 26 సెప్టెంబరు 2018 (12:13 IST)
ప్రియుడి కోసం అన్వేషిస్తూ ఇంగ్లాండ్ నుంచి ఇండియాకొచ్చింది ఆ యువతి. పెళ్లి చేసుకుంటానని ప్రవాస భారతీయురాలిని ప్రేమ పేరుతో మోసగించి పారిపోయాడు ఆ వంచకుడు. ఎన్నో రాష్ట్రాలకు వెళ్లి గాలించిన మీదట తన ప్రియుడు హైదరాబాద్‌లోనే ఉన్నట్టు చివరికి తెల్సుకుంది. ప్రేమ పేరుతో తన జీవితంతో చెలగాటమాడిన అతన్ని పట్టుకోవాలని పోలీసుల్ని వేడుకుంటుంది ఆ బాధితురాలు. ఇంగ్లాండ్ నుంచి వచ్చి ప్రియుడి జాడ కోసం అలుపెరగకుండా శ్రమించింది ఈ అభాగ్యురాలు. 
 
వివరాల్లోకి వెళితే... కోల్‌కత్తాకు చెందిన ఈ యువతిని అదే ప్రాంతానికి చెందిన రిభూరంజన్ సహా అనే వ్యక్తి లింగ్ టెన్ ఆన్లైన్ సైట్లో ఏడాది క్రితం పరిచయమయ్యాడు. సోషల్ మీడియాలో ఒకరి అభిప్రాయాలు మరొకరు తెల్సుకున్నారు. మనస్సులు కలిశాయి. తాను ప్రేమిస్తున్నానని చెప్పిన రిభూరంజన్ మాటలు నమ్మి అతనికి సర్వస్వం అప్పగించింది. కాబోయే భర్తేనని భావించి హద్దులు దాటేసింది ఈ యువతి. అంతలో తల్లిదండ్రుల ఒత్తిడితో ఎం.ఎస్.సీ. చదివేందుకు ఇంగ్లాండ్‌కు వెళ్తున్నాని ప్రియుడికి చెప్పి వెళ్లిపోయింది.
 
ఆ తర్వాత అతను ఎటో వెళ్లిపోయాడు. రిభూ కోసం అతని మిత్రులను కలిసింది. అలా చివరికి అతని చిరునామా తెల్సుకుంది. భువనగిరిలో సుహాలి ఎస్టేట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడని తెల్సుకుని అక్కడికి వెళ్లింది. అక్కడ తనపై దాడి చేసి.. ఇంట్లోనే నిర్భందించాడని.. స్థానికుల సహకారంతో బయటపడ్డానని చెప్పింది. రిభూ తన పాస్‌పోర్ట్‌ని లాక్కుని తగులబెట్టేందుకు యత్నించాడని వాపోయింది. తప్పైపోయింది.. మన్నించమంటూ మళ్లీ ప్రియురాలిని తీసుకుని హైదరాబాద్‌కు చేరాడితను. 
 
ఓ హోటల్ రూమ్ అద్దెకు తీసుకుని అక్కడికి వెళ్లిన ఈమెకు ఊహించని విధంగా ప్రియుడి చేతిలో అవమానానికి గురైంది. పెళ్లి చేసుకునేదే లేదు.. దిక్కున్నచోటకి వెళ్లి చెప్పుకో అంటూ అడ్డం తిరిగాడతను. దీంతో షాక్ తిన్న సదరు యువతి భువనగిరి పోలీసులకు, మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనలా మరొక యువతి అతని చేతిలో మోసపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటుంది ఈ యువతి. బాధితురాలు గతంలో కోల్ కత్తా, అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. 
 
అటు చదువుపై దృష్టి పెట్టలేక.. ఇంగ్లాండ్‌కు వెళ్లలేని పరిస్థితుల్లో హైదరాబాద్‌లోనే ఉండిపోయానని చెప్తోంది. రిభూరంజన్ ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా.. తప్పుడు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడనే ఆధారాలను బయటపెట్టింది. తనకు జరిగిన అన్యాయం మరే యువతికి జరగకుండా ఉండేందుకు పోరాడుతున్న తనకు రిభూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని.. అతన్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతుంది బాధితురాలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు 16 యేళ్లు ఉన్నపుడు 23 యేళ్ళ కుర్రోడితో డేటింగ్ చేశా.. యాంకర్ పద్మావతి