Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు నుంచి బయటకు లాగి.. 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

వయోబేధం లేకుండా మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బీహార్‌లో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి హసన

Advertiesment
రైలు నుంచి బయటకు లాగి.. 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
, మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (18:21 IST)
వయోబేధం లేకుండా మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బీహార్‌లో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి హసన్‌ బజార్‌ ప్రాంతంలో నలుగురు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. బాధితురాలిని గ్రహణీ రైల్వే స్టేషన్‌లో రైలు నుంచి బయటకులాగి మరీ లైంగికదాడికి ఒడిగట్టారు. నిందితులందరూ ఆమె గ్రామానికి చెందిన వారే. పైగా ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఆమె సోదరుడిని హతమార్చుతామని బెదిరించారు. కానీ ఆమె ధైర్యంగా మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితులను అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఈ ఘటన నేపథ్యంలో రైళ్లల్లో మహిళలు, విద్యార్థులు, చిన్నారులపై వేధింపులకు పాల్పడేవారికి చెక్‌ పెట్టేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతున్నది. ఇక నుంచి రైళ్లలో ఆడవారిని వేధిస్తే మూడేండ్ల జైలు శిక్ష విధించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి రైల్వే యాక్ట్‌ కింద చర్యలు తీసుకోనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కింగ్ ఫిషర్ బీర్ దొరకడంలేదంటూ రోడ్డెక్కిన మందుబాబు... హంగామా...