Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోడ్డుపై నిల్చుని యువతుల చేతుల్ని తాకుతూ వేధించిన పోలీస్

రక్షణ కల్పించాల్సిన పోలీసే ఇలా వ్యవహరించాడు. రోడ్డుపై నిల్చుని తనను దాటుకుని వెళ్లే యువతుల చేతుల్ని తాకుతూ వెర్రి ఆనందం పొందాడు. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో వుండి.. ఇలాంటి పనిచేయడంతో అతనిని విధుల న

రోడ్డుపై నిల్చుని యువతుల చేతుల్ని తాకుతూ వేధించిన పోలీస్
, శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:03 IST)
రక్షణ కల్పించాల్సిన పోలీసే ఇలా వ్యవహరించాడు. రోడ్డుపై నిల్చుని తనను దాటుకుని వెళ్లే యువతుల చేతుల్ని తాకుతూ వెర్రి ఆనందం పొందాడు. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో వుండి.. ఇలాంటి పనిచేయడంతో అతనిని విధుల నుంచి తప్పించారు.
 
వివరాల్లోకి వెళితే... కొచ్చిలోని తివారాలో ఓ చర్చి ముందు విధులు నిర్వహిస్తున్న శివకుమార్‌ అనే హోమ్ గార్డు, అటుగా వెళుతున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధించాడు. ఈ వ్యవహారాన్ని అక్కడున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్‌లో దీన్ని తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
అంతేగాకుండా సదరు హోమ్ గార్డు చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు సదరు పోలీసుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలమక్కరాకు చెందిన శివకుమార్ వయసు 58 సంవత్సరాలు కాగా, తన మనవరాళ్ల వయసులో ఉండి, పాఠశాలలకు వెళుతున్న విద్యార్థినులను కూడా వదల్లేదు. చేతుల్ని తాకుతూ రోడ్డుపై నిల్చున్నాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూసిన సిటి పోలీస్‌ కమిషనర్‌ సీరియస్‌ అయ్యారు. శివకుమార్‌ను విధుల నుంచి తొలగించడంతో పాటు, ఐపీసీ 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాటరింగ్ పేరుతో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. కాదంటే నరకమే...