Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒంటిపై నూలు పోగు లేకుండా కారు దిగిన యువతి... జడ్జి పదవి పోయింది...

రష్యాలో ఒక మహిళ వింతైన ప్రవర్తన వల్ల దానికి ఎలాంటి సంబంధం లేని జిల్లా కోర్టు చైర్మన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అరే ఇదేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? రష్యాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్‌లో హల్చల్ చేస్తోంది. వివరాలల్లోకి వెళితే, ఒక

Advertiesment
judge
, బుధవారం, 22 ఆగస్టు 2018 (18:13 IST)
రష్యాలో ఒక మహిళ వింతైన ప్రవర్తన వల్ల దానికి ఎలాంటి సంబంధం లేని జిల్లా కోర్టు చైర్మన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అరే ఇదేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? రష్యాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్‌లో హల్చల్ చేస్తోంది. వివరాలల్లోకి వెళితే, ఒక మహిళ నగ్నంగా SUV నుండి దిగి గ్యాస్ స్టేషన్‌కి వెళ్లి షాంపేన్ కొన్నది. ఆమెతో పాటు కారులో నుంచి దిగిన మరొక వ్యక్తి ఆ సన్నివేశాన్ని వీడియోలో చిత్రీకరిస్తూ ఆమె వెన్నంటే వచ్చాడు. 
 
ఆమె బాగా మేకప్ వేసుకుని, విక్టోరియా మోడల్ మాదిరిగా ఉంది. మరోవైపు ఆ వ్యక్తి సాదాసీదాగా కనిపించాడు. ఆమె షాంపేన్ కొని మళ్లీ వెనుదిరిగింది. ఈ తతంగమంతా అక్కడ ఉన్న సీసీటీవీల్లో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో కాస్తా రష్యా మీడియాలో ప్రముఖంగా ప్రసారం చేయబడింది. దానికి తోడు వివిధ NGOలలో పని చేసే వ్యక్తులు ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చారు. 
 
అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి స్టావ్రోపోల్ నగరంలోని ఒక్ట్యాబ్రిస్కై జిల్లా కోర్ట్ చైర్మన్ యూరీ మెకరోవ్ అని ప్రముఖంగా వార్తల్లో రావడం వల్ల అతడిని రాజీనామా చేయాల్సిందిగా ప్రెస్ సెక్రటరీ కోరారు. అయితే ఆ వీడియోకి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మాదిరిగా తనకు అంతపెద్ద పొట్ట లేదని, అలాగే తన భార్యాపిల్లలు కూడా తనని గుర్తించలేదని చెప్పాడు. గతంలో చెచెన్ టెర్రరిస్ట్ గ్రూప్ నాయకుడికి 16 ఏళ్ల జైలు శిక్ష విధించిన కారణంగా తనపై కక్షతో చెచెన్ టెర్రరిస్ట్‌లు లేదా వారి అనుబంధ సంస్థలు ఈ పని చేసి ఉంటాయని చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళకు విదేశీ సాయాలకు నో... అమ్మ పెట్టనూ పెట్టదు... అడుక్కు తిననివ్వదు