Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

65 యేళ్ళ వయసులో అక్రమసంబంధం అంటగట్టి భార్యను చంపిన వృద్ధ భర్త

ఓ వృద్ధ భర్త అత్యంత కిరాతక చర్యకు పూనుకున్నాడు. 65 యేళ్ల వయసులో ఉన్న తన భార్యకు అక్రమసంబంధం అంటగట్టి ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో జరిగింది. పైగా, ఈ కేసు

Advertiesment
65 యేళ్ళ వయసులో అక్రమసంబంధం అంటగట్టి భార్యను చంపిన వృద్ధ భర్త
, సోమవారం, 9 జులై 2018 (10:28 IST)
ఓ వృద్ధ భర్త అత్యంత కిరాతక చర్యకు పూనుకున్నాడు. 65 యేళ్ల వయసులో ఉన్న తన భార్యకు అక్రమసంబంధం అంటగట్టి ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో జరిగింది. పైగా, ఈ కేసు విచారణ కేవలం 11 రోజుల్లో పూర్తికాగా, వృద్ధభర్తకు జీవితశిక్ష విధిస్తూ కోర్టు ఆదేశించింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, చిత్రదుర్గ తాలూకాలోని చల్లకెరెకు చెందిన పరమేశ్వర స్వామి అనే 75 యేళ్ళ వృద్ధుడు ఉండగా, ఈయనకు 65 యేళ్ళ వృద్ధ భార్య పుట్టమ్మ ఉంది. అయితే, గత నెల 27వ తేదీన ఆమెను దుడ్డుకర్రతో చావబాది హత్య చేశాడు. అదే రోజు నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ చిత్రదుర్గ కోర్టులో సాగగా, కేవలం 11 రోజుల్లో విచారణ ముగించి తుదితీర్పును వెలువరించారు. 
 
ఈ కేసులో పరమేశ్వరస్వామి కుమారుడు వాంగ్మూలం ఇస్తూ గ్రామస్తులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ తన తల్లిని తండ్రి నిత్యం వేధించేవాడని పేర్కొన్నాడు. ఈ వాంగ్మూలం కీలకంగా మారగా, మొత్తం 30 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడి కుమారుడు గిరీశ్ సహా 17 మంది వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఫోరెన్సిక్ వివరాలను కూడా రెండు రోజుల్లోనే కోర్టుకు సమర్పించడంతో కేసు విచారణ త్వరగా పూర్తయినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
తరచూ ఆమెతో గొడవపడి దాడి చేసేవాడనీ, ఆమె హత్యకు ఇదే కారణమని పోలీసులు నిర్ధారించారు. కేసు పూర్వాపరాలను విశ్లేషించిన కోర్టు నిందితుడిని దోషిగా తేలుస్తూ జీవిత ఖైదు విధించింది. కేవలం 11 రోజుల్లోనే ఓ కేసులో తీర్పు రావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలయ్య మనవడికి ఏం పేరు పెట్టారో తెలుసా?